Homeట్రెండింగ్ న్యూస్KTR Son Himanshu Song: కేటీఆర్ కొడుకా మజాకా... మైకేల్ జాక్సన్ నే మరిపించాడు

KTR Son Himanshu Song: కేటీఆర్ కొడుకా మజాకా… మైకేల్ జాక్సన్ నే మరిపించాడు

KTR Son Himanshu Song
KTR Son Himanshu Song

KTR Son Himanshu Song: ఉదయాన్నే యూట్యూబ్ సెర్చ్ చేస్తుంటే గోల్డెన్ అవర్ వర్సెస్ హిమాన్షు కవర్ అనే ఓ థంబ్ లైన్ కనిపించింది. అది కూడా పెద్ద హంగు ఆర్భాటమేమీ లేకుండా ఓ సాయంకాలం సమయాన ఇద్దరు ప్రేమికులు ఏకాంతంగా ఉన్నట్టు.. రూపొందించారు. సరే ఏంటో చూద్దామని క్లిక్ చేస్తే… కేటీఆర్ కొడుకు హిమాన్షు గొంతు లాగా అనిపించింది.. ఏదో ఇంగ్లీషులో ఉంది ఆ గీతం.. ప్రేమలో పడ్డ తొలినాళ్లలో తన ప్రేయసిని ఓ సాయంకాలం సమయాన కలుసుకున్న ఓ ప్రియుడు.. ఆమె సాంగత్యంలో తన భావుకత్వాన్ని వివరిస్తున్నట్టుగా ఈ పాట రాసి పాడాడు.

” నేనిప్పుడు వినీలాఆకాశంలో వివరిస్తున్న. తన ఒడిలో సేద తీరుతున్న. ఈ సాయంకాలం సమయం ఒక గంట మాత్రమే. కానీ నాకు ఎంతో విలువైంది. అమ్మ ఫోన్ చేస్తే నేను ఊహ లోకంలో విహరిస్తున్న అని చెప్పా” అనుకుంటూ పాడాడు ఈ పాట. మక్కికి మక్కి దించితే అనువాదం చెడిందేమో కానీ.. పాట మాత్రం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆ గొంతు సరళంగా, మృదువుగా ఉంది. హిమాన్షు సన్నబడ్డట్టు ఆయన గొంతు కూడా చాలా సన్నగా మారింది. పాటలో అద్భుతమైన భావాన్ని పలికించాడు..

KTR Son Himanshu Song
KTR Son Himanshu Song

తన కొడుకు ఈ పాటను పాడటం పట్ల కేటీఆర్ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. గర్వంగా ఉందంటూ కితాబిచ్చాడు. నువ్వు ఇలానే ఎదిగిపోవాలి అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. హిమాన్షు మేనత్త కవిత కూడా ఈ పాట విని ఆనందం వ్యక్తం చేసింది. గర్వంగా ఉందని దీవెనలు అందజేసింది.. అన్నట్టు హిమాన్షు పాటగాడు మాత్రమే కాదు.. మంచి చదువరి కూడా. ఆ మధ్య రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో ఆర్థిక స్వావలంబన, గ్రామీణ పల్లెలు అనే నేపథ్యంలో ఒక డాక్యుమెంట్రీ కూడా తీశాడు.. తాను చదువుతున్న ఒక్రిడ్జ్ స్కూల్లో కూడా టాపర్. మిగతా విషయాలు పక్కన పడేస్తే.. ఆ పొలిటికల్ వాసన లేని ఫీల్డ్ లోకి తాను వస్తుండటం మంచి విషయం. ఆ దిశగా కేటీఆర్ కూడా ప్రోత్సహిస్తుండడం మరింత ముదావహం. కానీ యూట్యూబ్లో ఈ పాట విడుదల చేశాడో లేదో భారత రాష్ట్ర సమితి నాయకులు తప్పెట్లు తాళాలతో డీజే లెవెల్ లో భజన చేస్తున్నారు.. అహోఓహో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మైకేల్ జాక్సన్ ను మరిపించాడు అంటున్నారు. అయ్యో… ఇక్కడ కూడా ఈ భజనేనా…

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular