https://oktelugu.com/

OYO Room : లవర్ తో కలిసి ఓయో రూమ్ కు వెళ్లిన యువతి.. అనంతరం షాకింగ్ పరిణామం..

అలాంటప్పుడు హేమంత్ ఆకస్మాత్తుగా చనిపోవడం పట్ల వారు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు లోతుగా విచారిస్తే అసలు విషయాలు బయటికి తెలుస్తాయని హేమంత్ స్నేహితులు భావిస్తున్నారు. కాగా, ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది.

Written By:
  • NARESH
  • , Updated On : May 1, 2024 / 09:35 PM IST

    A young woman who went to the Oyo room with her lover

    Follow us on

    OYO  Room : అతడి పేరు హేమంత్(28). ఇటుకల వ్యాపారి.. సొంత ఊరు మహ బూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. ఏడు సంవత్సరాల క్రితం ఓ యువతితో పరిచయమైంది. అది ప్రేమకు దారి తీసింది. ఇక అప్పటి నుంచి వారు ప్రేమించుకుంటున్నారు. అవకాశం కుదిరినప్పుడల్లా శారీరకంగా కలుస్తున్నారు. అయితే, మంగళవారం తన ప్రియురాలితో కలిసి హేమంత్ హైదరాబాదులోని ఓ ప్రాంతంలో జరిగిన వేడుకకు హాజరయ్యాడు. ఇద్దరు అక్కడ భోజనం చేసి ఎస్సార్ నగర్ లోని ఓయో హోటల్లో రూమ్ తీసుకున్నారు. అక్కడ హేమంత్ మద్యం తాగాడు. రాత్రి రెండు గంటలకు మూత్ర విసర్జన కోసం బాత్ రూం వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో ఆ యువతికి అనుమానం వచ్చింది. బాత్రూం వెళ్లి చూడగా, అతడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

    దీంతో కంగారుపడిన ఆ యువతి హేమంత్ స్నేహితులకు ఫోన్ చేసింది. వారు వెంటనే ఆ ప్రదేశానికి వచ్చి, 108 కి ఫోన్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించగా.. హేమంత్ మృతి చెందినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని హేమంత్ స్నేహితులు అతడి తల్లికి ఫోన్ ద్వారా చెప్పారు. దీంతో ఆమె లబోదిబో అనుకుంటూ ఓయో హోటల్ దగ్గరికి వచ్చారు. కొడుకు మృతదేహాన్ని చూసిన తర్వాత.. హేమంత్ తల్లి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. తన కొడుకు మృతి పట్ల అనుమానాలున్నాయని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు పై దర్యాప్తు చేపట్టాలని కోరింది.

    అధికంగా మద్యం తాగడం వల్ల హేమంత్ చనిపోయాడా? లేక హోటల్ రూమ్ లో ఇంకా ఏదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఏడు సంవత్సరాలుగా వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ఇద్దరి మధ్య పెద్దగా బేధాభిప్రాయాలు లేవని హేమంత్ స్నేహితులు చెబుతున్నారు. అలాంటప్పుడు హేమంత్ ఆకస్మాత్తుగా చనిపోవడం పట్ల వారు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు లోతుగా విచారిస్తే అసలు విషయాలు బయటికి తెలుస్తాయని హేమంత్ స్నేహితులు భావిస్తున్నారు. కాగా, ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది.