మలయాళ నటుడు ముఖేశ్ అంటే.. ఒక గొప్ప నటుడు అని పేరు ఉంది. కానీ, ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ వివాదాస్పదమే. అనేక ఆరోపణలు, అనేక విమర్శలు.. ఇలా ఆయన జీవితం చాలా ఆటుపోట్లతో సాగుతూ వచ్చింది. రెండో భార్య మెతిల్ దేవిక కూడా విడాకులు ఇవ్వడానికి సిద్దపడటంతో ఆయన పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
ఎనిమిదేళ్ల తమ వైవాహిక జీవితం బాధాకరం అని, అందుకే ఆ జీవితానికి ఇక ముగింపు పలుకుతున్నట్లుగా డ్యాన్సర్ దేవిక క్లారిటీ ఇవ్వడంతో ముఖేశ్ కి పరువు పోయినంత పని అయింది. దేవిక అతని గురించి ఏమి మాట్లాడింది అంటే.. ‘ముఖేశ్ పైకి చాలా మంచివాడు కావొచ్చు, కానీ అతను మంచి భర్త కాదు. మా పెళ్లై ఎనిమిదేళ్లు అయింది. అయినా అతను నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.
నిజానికి నాకు అతని పరువు తీయాలనే ఉద్దేశం లేదు. అలాగే రాజకీయ నాయకుడిగా, నటుడిగా అతని వ్యక్తిగత విషయాల గురించి నేను ప్రస్తావించాలనుకోవడం లేదు. ఇక అతని మీద అనేక రాజకీయ ఆరోపణలు ఉన్నాయి. వాటి గురించి కూడా నాకు స్పందించేంత అవసరం, ఆసక్తి లేదు. అయితే, నేను అతని మీద గృహ హింస ఆరోపణలు చేయడం లేదు. కానీ, అతనితో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధమయ్యాను.
కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతని నుండి విడిపోవడానికి విడాకుల కోసం దరఖాస్తు చేశాను. దయచేసి ఈ విషయాన్ని రాద్దాంతం చేయకండి. నేనేమీ ఆవేశంలో, కోపంతో అతడితో విడిపోవడం లేదు. ఎంతో ఆలోచించి.. అలాగే అన్ని విధాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చింది దేవిక. ఇక విడాకులకు సంబంధించి లీగల్ నోటీసులు తనకు ఇంకా అందలేదంటూ ముఖేశ్ కబుర్లు చెబుతున్నాడు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Methil devika announces divorce from malayalam actor mukesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com