Homeఅప్పటి ముచ్చట్లుఆ నవ్వులకు కారణం ఆయన కలం బలమే !

ఆ నవ్వులకు కారణం ఆయన కలం బలమే !

DV Narasa Rajuఅలనాటి దిగ్గజ సినీ రచయితలలో ‘డి.వి. నరసరాజు’ది ప్రత్యేక స్థానం. తెలుగు రచయితల వర్గానికి ఆయనో భీష్మాచార్యుడు. ఆయన గురించి క్లుప్తంగా చెప్పుకుంటే.. నేడు రచయితలకు సంఘం ఉంది అంటే.. ఆ రోజుల్లో మద్రాసులో ఆయన నెలకొల్పిన తెలుగు సినీ రచయితల సంఘమే కారణం. డి.వి. నరసరాజు సినిమాల్లో గొప్పగా చెప్పుకునే సినిమా ‘గుండమ్మకథ’.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నిక్కర్‌ వేసుకుని నటించారు. అప్పటికే ఎన్టీఆర్ అంటే తెలుగు తెరకు ఆరాధ్య దైవం. కాబట్టి ఈ సినిమాను అలాగే విడుదల చేస్తే ప్రజలు చెప్పులతో కొడతారేమో అని విజయావారు విచారణ వ్యక్తం చేస్తూ అయోమయంలో ఉన్న సమయం అది. ఆ సమయంలోనే విజయావారి ఇంట్లో ఒక ఫంక్షన్‌ జరిగింది.

ఆ ఫంక్షన్ కి వచ్చిన అందరికీ ప్రత్యేకంగా తమ ఇంట్లోని సొంత థియేటర్‌లో గుండమ్మ కథ సినిమా షో వేశారు. సినిమా చూసి అందరూ పడీపడీ నవ్వారు. ఆ నవ్వులు చూశాకే విజయావారికి ధైర్యం వచ్చి.. సినిమాను రిలీజ్‌ చేశారు. రిలీజ్ అయ్యాక ఆ సినిమా క్రియేట్ చేసిన నవ్వుల రికార్డులు ఇప్పటికీ ప్రత్యేకమే. ఆ నవ్వుల వెనుక డి.వి. నరసరాజు కలం బలం ఎంతో ఉంది.

అలాగే ‘రాముడు భీముడు’ సినిమా కథ విషయంలో కూడా చాల వ్యవహారం నడిచింది. రామానాయుడు గారికి నరసరాజుగారు అప్పటికే రెండు కథలు చెప్పారు. ‘ఏమిటండీ నరసరాజుగారు మీ స్థాయికి తగ్గ కథ చెప్పడం లేదు’ అంటూ రామానాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడు నరసరాజుగారు ‘నా స్థాయి కథ చెబితే మీకు నచ్చదులేండి’.

‘అందుకే ఇక మీ స్థాయికి దిగి కథ చెబుతా’ అని ‘రాముడు- భీముడు’ కథ చెప్పారు. ఆ కథ ఇప్పటికీ సేల్ అవుతూనే ఉంది. అది నరసరాజుగారి గొప్పతనం అంటే. ఆయన మహా రచయితే కాదు, మహా మనిషి కూడా.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version