ఆ నవ్వులకు కారణం ఆయన కలం బలమే !

అలనాటి దిగ్గజ సినీ రచయితలలో ‘డి.వి. నరసరాజు’ది ప్రత్యేక స్థానం. తెలుగు రచయితల వర్గానికి ఆయనో భీష్మాచార్యుడు. ఆయన గురించి క్లుప్తంగా చెప్పుకుంటే.. నేడు రచయితలకు సంఘం ఉంది అంటే.. ఆ రోజుల్లో మద్రాసులో ఆయన నెలకొల్పిన తెలుగు సినీ రచయితల సంఘమే కారణం. డి.వి. నరసరాజు సినిమాల్లో గొప్పగా చెప్పుకునే సినిమా ‘గుండమ్మకథ’. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నిక్కర్‌ వేసుకుని నటించారు. అప్పటికే ఎన్టీఆర్ అంటే తెలుగు తెరకు ఆరాధ్య దైవం. కాబట్టి ఈ […]

Written By: admin, Updated On : July 9, 2021 4:45 pm
Follow us on

అలనాటి దిగ్గజ సినీ రచయితలలో ‘డి.వి. నరసరాజు’ది ప్రత్యేక స్థానం. తెలుగు రచయితల వర్గానికి ఆయనో భీష్మాచార్యుడు. ఆయన గురించి క్లుప్తంగా చెప్పుకుంటే.. నేడు రచయితలకు సంఘం ఉంది అంటే.. ఆ రోజుల్లో మద్రాసులో ఆయన నెలకొల్పిన తెలుగు సినీ రచయితల సంఘమే కారణం. డి.వి. నరసరాజు సినిమాల్లో గొప్పగా చెప్పుకునే సినిమా ‘గుండమ్మకథ’.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నిక్కర్‌ వేసుకుని నటించారు. అప్పటికే ఎన్టీఆర్ అంటే తెలుగు తెరకు ఆరాధ్య దైవం. కాబట్టి ఈ సినిమాను అలాగే విడుదల చేస్తే ప్రజలు చెప్పులతో కొడతారేమో అని విజయావారు విచారణ వ్యక్తం చేస్తూ అయోమయంలో ఉన్న సమయం అది. ఆ సమయంలోనే విజయావారి ఇంట్లో ఒక ఫంక్షన్‌ జరిగింది.

ఆ ఫంక్షన్ కి వచ్చిన అందరికీ ప్రత్యేకంగా తమ ఇంట్లోని సొంత థియేటర్‌లో గుండమ్మ కథ సినిమా షో వేశారు. సినిమా చూసి అందరూ పడీపడీ నవ్వారు. ఆ నవ్వులు చూశాకే విజయావారికి ధైర్యం వచ్చి.. సినిమాను రిలీజ్‌ చేశారు. రిలీజ్ అయ్యాక ఆ సినిమా క్రియేట్ చేసిన నవ్వుల రికార్డులు ఇప్పటికీ ప్రత్యేకమే. ఆ నవ్వుల వెనుక డి.వి. నరసరాజు కలం బలం ఎంతో ఉంది.

అలాగే ‘రాముడు భీముడు’ సినిమా కథ విషయంలో కూడా చాల వ్యవహారం నడిచింది. రామానాయుడు గారికి నరసరాజుగారు అప్పటికే రెండు కథలు చెప్పారు. ‘ఏమిటండీ నరసరాజుగారు మీ స్థాయికి తగ్గ కథ చెప్పడం లేదు’ అంటూ రామానాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడు నరసరాజుగారు ‘నా స్థాయి కథ చెబితే మీకు నచ్చదులేండి’.

‘అందుకే ఇక మీ స్థాయికి దిగి కథ చెబుతా’ అని ‘రాముడు- భీముడు’ కథ చెప్పారు. ఆ కథ ఇప్పటికీ సేల్ అవుతూనే ఉంది. అది నరసరాజుగారి గొప్పతనం అంటే. ఆయన మహా రచయితే కాదు, మహా మనిషి కూడా.