https://oktelugu.com/

మేకసూరి-2 రివ్యూ.. హిట్టా.. ఫ్లాపా?

క్రైమ్ థిల్లర్ గా తెరకెక్కిన ‘మేకసూరి-1’ మూవీకి సిక్వెల్ గా ‘మేకసూరి-2’ తాజాగా రిలీజైంది. ప్రముఖ ఓటీటీ జీ-5 యాప్ లో మేకసూరి-2 నవంబర్ 27న రిలీజైంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమినేట్స్ మేకసూరి పార్ట్-1 కంటే సెకండ్ పార్ట్ లో బాగా ఉన్నాయి. ఈ సినిమా కథ విషయానికొస్తే ఎలా ఉందో చూద్దాం.. Also Read: ఫీల్డ్ లోనూ ‘బుట్టబొమ్మ’ను వదలని వార్నర్..! మేకసూరి పార్ట్-1 విషయానికొస్తే సింగరాయకొండ గ్రామంలో కసాయి వృత్తి చేసే సూరి(అభినయ్).. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2020 / 05:02 PM IST
    Follow us on

    క్రైమ్ థిల్లర్ గా తెరకెక్కిన ‘మేకసూరి-1’ మూవీకి సిక్వెల్ గా ‘మేకసూరి-2’ తాజాగా రిలీజైంది. ప్రముఖ ఓటీటీ జీ-5 యాప్ లో మేకసూరి-2 నవంబర్ 27న రిలీజైంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమినేట్స్ మేకసూరి పార్ట్-1 కంటే సెకండ్ పార్ట్ లో బాగా ఉన్నాయి. ఈ సినిమా కథ విషయానికొస్తే ఎలా ఉందో చూద్దాం..

    Also Read: ఫీల్డ్ లోనూ ‘బుట్టబొమ్మ’ను వదలని వార్నర్..!

    మేకసూరి పార్ట్-1 విషయానికొస్తే సింగరాయకొండ గ్రామంలో కసాయి వృత్తి చేసే సూరి(అభినయ్).. రాణి(సుమయ) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే గ్రామపెద్ద అప్పలనాయుడు(శరత్ కుమార్) ఇద్దరు స్నేహితులతో కలిసి సూరి భార్య రాణిని రేప్ చేసి హత్య చేస్తారు. దీంతో సూరి రాక్షసుడిలా మారిపోతాడు. దీనికి సెక్వెల్ గానే ‘మేక సూరి-2’ తెరకెక్కింది.

    మేకసూరి రెండో పార్టులో సూరి గ్రామ పెద్దైన అప్పలనాయుడు.. మరో ఇద్దరిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? సూరిని అడ్డుకోవడానికి ఏసీపీ(ప్రమోద్) ఎలాంటి చర్యలు తీసుకున్నాడు.. సూరి నక్సల్స్ దళంలో చేరి ఎలా ప్రతీకారం తీర్చికున్నాడనేది రెండో పార్టులో దర్శకుడు త్రినాథ్ వెలిశాల ఆకట్టుకునేలా చూపించాడు.

    Also Read: దీపికా డీపీ చేంజ్.. అవాక్కవుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?

    మేకసూరి-2 గ్రామీణ నేపథ్యంతో నాటుగా కొనసాగుతుంది. ఈ సినిమా కేవలం మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొనే తెరకెక్కించినట్లు కన్పిస్తోంది. సూరిగా క్యారెక్టర్‌కు అభినయ్ చక్కగా సరిపోయాడు. పోలీస్ అధికారి నరేష్ బైరెడ్డి.. జర్నలిస్టుగా శ్రవణ్.. పాత్రలు బాగున్నాయి. రఘురాం పాత్ర కథలో ట్విస్టు ఇస్తుంది. కథకథనాలు బాగున్నాయి.

    పార్థూ సినిమాటోగ్రఫీ.. క్రిష్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. సురేష్ ఎడిటింగ్ బాగుంది. మొత్తానికి మేకసూరి-2 మూవీ క్రైమ్ సినిమాలు చూసే ఆడియెన్స్ కు  తెగ నచ్చుతుంది. ఇక ఈ మూవీకి త్వరలోనే మూడో సిక్వెల్ రానుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్