https://oktelugu.com/

బిగ్ బాస్-4: సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన మొనాల్..!

కరోనా టైంలోనూ ‘బిగ్ బాస్’ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తెలుగు రియల్టీ షోలలో నెంబర్ వన్ గా కొనసాగుతున్న బిగ్ బాస్ తన స్థానాన్ని బిగ్ బాస్-4తో మరింత పదిలం చేసుకున్నట్టే కన్పిస్తోంది. బిగ్ బాస్-4 సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. దీంతో ప్రేక్షకులు బిగ్ బాస్ ను చూసేందుకు మరింత ఆసక్తిని చూపుతున్నారు. Also Read: మేకసూరి-2 రివ్యూ.. హిట్టా.. ఫ్లాపా? ప్రస్తుతం బిగ్ బాస్-4లో దెత్తడి హరిక.. మొనాల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2020 / 05:05 PM IST
    Follow us on

    కరోనా టైంలోనూ ‘బిగ్ బాస్’ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తెలుగు రియల్టీ షోలలో నెంబర్ వన్ గా కొనసాగుతున్న బిగ్ బాస్ తన స్థానాన్ని బిగ్ బాస్-4తో మరింత పదిలం చేసుకున్నట్టే కన్పిస్తోంది. బిగ్ బాస్-4 సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. దీంతో ప్రేక్షకులు బిగ్ బాస్ ను చూసేందుకు మరింత ఆసక్తిని చూపుతున్నారు.

    Also Read: మేకసూరి-2 రివ్యూ.. హిట్టా.. ఫ్లాపా?

    ప్రస్తుతం బిగ్ బాస్-4లో దెత్తడి హరిక.. మొనాల్ గజ్జర్.. అరియానా.. అభిజిత్.. అఖిల్.. అరియానా.. అవినాష్ మాత్రమే మిగిలి ఉన్నారు. వీరి మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఈ ఏడుగురిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరా? అనేది ఆసక్తి మొదలైంది. ఈ వారం నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ షాకులు మీద షాకిలిస్తున్నాడు.

    వచ్చేవారానికి ఇమ్యూనిటీని అవినాష్ గెలుచుకోవడంతో గేమ్ మరింత రసవత్తరంగా మారింది. ఈవారం బిగ్ బాస్ ఎలిమినేషన్ నుంచి అవినాష్ ఎస్కేప్ అయితే మాత్రం అతడు మరో మూడు వారాలదాకా హౌస్ లో కొనసాగే అవకాశం ఉంది. దీంతో అతడు టాప్-5లో ఉండటం ఖాయంగా కన్పిస్తోంది. ఈ వారం నామినేషన్ నుంచి తొలుత తప్పించుకున్న మొనాల్ కెప్టెన్ హారిక కారణంగా అనుహ్యంగా నామినేషన్లోకి వెళ్లాల్సి వచ్చింది.

    ఈవారం ఎలిమినేషన్ జోన్లో అఖిల్..  అరియానా.. అవినాష్.. మొనాల్ ఉన్నారు. వీరందరిలో మొనాల్ ఓట్లలో దూసుకెళుతుందని విశ్వసనీయ సమాచారం. ఈవారం మొనాల్ ఒక్కదానికే 40శాతం పైగా ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. నామినేషన్లో అభిజిత్ లేకపోవడం మొనాల్ కు కలిసొచ్చిందని తెలుస్తోంది.

    Also Read: దీపికా డీపీ చేంజ్.. అవాక్కవుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?

    అంతేకాకుండా కెప్టెన్ హరిక ఆమెను నామినేషన్స్ లోకి పంపడంతో అజిభిత్.. హరిక ఫ్యాన్స్ ఓట్లన్నీ కూడా మొనాల్ కే గంపగుత్తగా పడినట్లు తెలుస్తోంది. మిగిలిన ముగ్గురిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ ఉండదనే లీకులు విన్పిస్తున్నాయి. దీంతో ఈ వారం బిగ్ బాస్ ట్వీస్ట్ ఇస్తాడా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్