https://oktelugu.com/

దీపికా డీపీ చేంజ్.. అవాక్కవుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ సినిమాల్లో ఎంత బీజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు సైతం టైమ్ కేటాయిస్తూ ఉంటోంది. తన సినిమాలకు సంబంధించిన విషయాలతోపాటు ఫొటో షూట్.. వీడియోలు.. పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటుంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్లలో చేరుకుంది. Also Read: విక్రమ్ నుండి క్లారిటీ.. పుష్ప బాధ పోగొట్టేవాళ్లు ఎవరో ? తాజాగా దీపిక పదుకోన్ తన డీపీని ఛాంజ్ చేసింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2020 8:33 pm
    Follow us on

    Deepika Padukone

    బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ సినిమాల్లో ఎంత బీజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు సైతం టైమ్ కేటాయిస్తూ ఉంటోంది. తన సినిమాలకు సంబంధించిన విషయాలతోపాటు ఫొటో షూట్.. వీడియోలు.. పర్సనల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటుంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్లలో చేరుకుంది.

    Also Read: విక్రమ్ నుండి క్లారిటీ.. పుష్ప బాధ పోగొట్టేవాళ్లు ఎవరో ?

    తాజాగా దీపిక పదుకోన్ తన డీపీని ఛాంజ్ చేసింది. అయితే తన మాజీ ప్రియుడితో కలిసి దిగిన ఫొటోతో దీపిక దర్శనం ఇవ్వడంతో నెటిజన్లంతా షాక్ గురయ్యారు. దీపిక ఉన్నట్టుండి తన మాజీ ప్రియుడి ఫొటోను డీపీగా పెట్టడం ఏంటనే ఆరా తీశారు. అయితే ఇందుకు ప్రత్యేక కారణం ఉండటంతో ఫ్యాన్స్ కు దీపిక ఇచ్చిన షాక్ నుంచి మెల్లిగా కోలుకుంటున్నారు.

    దీపిక పదుకోన్-రణ్ బీర్ కపూర్ కొంతకాలం రిలేషన్ షిప్ ఉన్నారనే టాక్ బాలీవుడ్లో ఉంది. ఇక వీరిద్దరు 2015లో ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తమాషా’ మూవీలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా దీపిక-రణ్ వీర్ లకు మంచి పేరు తీసుకొచ్చింది.

    Also Read: ఫీల్డ్ లోనూ ‘బుట్టబొమ్మ’ను వదలని వార్నర్..!

    ‘తమాషా’ మూవీ రిలీజై 2020 నవంబర్ 27 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కారణంగానే దీపిక తన సోషల్ మీడియా ఖాతాలకు ‘తమాషా’ పోస్టర్ ను డీపీగా పెట్టుకుంది. అంతేకాకుండా తన ప్రొఫైల్ పేరును సైతం ఈ సినిమాలోని తన క్యారెక్టర్ అయిన ‘తార’గా మార్చుకుంది. దీంతో ‘తమాషా’ మూవీపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    అయితే ఉన్నట్టుండి దీపిక డీపీ ఛేంజ్ చేయడంపై ఇంకేదైనా విషయం ఉందా అని కొందరు ఆరాలు తీసే పనిలో పడ్డారు. దీపిక-రణ్ బీర్ రిలేషన్ ఉన్న తర్వాత విడిపోయిన సంగతి అందరికీ తెల్సిందే.. ఆ తర్వాత దీపికకు రణ్ వీర్ సింగ్ దగ్గరయ్యాడు. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారడంతో 2018లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్