మేఘా ఆకాశ్. నితిన్ సరసన ‘లై’ సినిమాతో తెరంగేట్రం చేసిందీ తమిళ్ అమ్మాయి. ఆపై పవర్ కళ్యాణ్, త్రివిక్రమ్ ప్రొడ్యూస్ చేసిన ‘ఛల్ మోహన్ రంగ’ తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నం చేసింది. కానీ ఆ రెండు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మేఘా తన మాతృక కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’తో తమిళ్‌లో అరంగేట్రం చేసింది. ఆపై, ధనుష్ హీరోగా వచ్చిన ‘తూటా’తో మెప్పించింది. శింబు సరసన ‘వింత రాజవతాన్ వరునెన్’, అథర్వ సరసన ‘బూమెరాంగ్’ వంటి చిత్రాలతో తమిళ్‌లో పాగా వేసింది. అక్కడితో ఆగకుండా బాలీవుడ్‌లో అడుగు పెట్టిందీ అమ్మడు. సూరజ్ పాంచోలి హీరోగా నటించిన ‘శాటిలైట్ శంకర్’తో హిందీ తెరకు పరిచయమైంది.
జివికె రెడ్డి వ్యాపారాలపై సిబిఐ దాడుల వెనక అసలు ఉద్దేశం ?
ప్రస్తుతం తమిళ్‌లో రెండు చిత్రాలు, తెలుగులో ‘మను చరిత్ర’ అనే మూవీలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న మేఘాకు ఓ బంపరాఫర్ తగిలింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మూవీలో యాక్ట్ చేసే చాన్స్ కొట్టేసింది. సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా ‘రాధే’ అనే సినిమా తీస్తున్నాడు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం మేఘా ఆకాశ్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ మొదలవగా.. మేఘా కూడా సెట్స్‌కు వస్తోంది. అనూహ్యంగా వచ్చిన అదృష్టంతో మేఘా ఇప్పుడు గాల్లో తేలిపోతోంది. సల్మాన్‌తో తెర పంచుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని అంటోంది. ప్రభుదేవా ఈ మూవీ కథ చెప్పినప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించిందని, పైగా తన గత చిత్రాలతో పోలిస్తే ‘రాధే’ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పింది. ఈ మూవీ తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో ఉందామె. ఇక సల్మాన్ ఖాన్‌పై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. అతను మంచి మనసున్న వ్యక్తి అని, సెట్లో ప్రతి ఒక్కరినీ పలుకరించి ఎవరికి ఏం అవసరం ఉన్నా చేసి పెడతాడని చెప్పింది. ఓ రోజు సల్మాన్ బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ గురించి అతనితో మాట్లాడితే మరుసటి రోజే తనకు బీయింగ్ హ్యూమన్ టీ షర్ట్ తీసుకొచ్చి ఇచ్చారని తెలిపింది.