https://oktelugu.com/

బాలయ్య హీరోయిన్‌గా అమలా పాల్‌?

అక్కినేని నాగ చైతన్య హీరోగా 2011లో వచ్చిన ‘బెజవాడ’ మూవీతో టాలీవుడ్‌కు పరిచమైన మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్. ఆ వెంటనే మెగా కాంపౌండ్‌లో అడుగుపెట్టిందామె. రామ్ చరణ్ తేజ్‌ హీరోగా ‘నాయక్’లో ఆడిపాడింది. అల్లు అర్జున్‌ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’లో లీడ్‌ హీరోయిన్‌గా చేసి మెప్పించింది. అయినా సరే తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. చివరగా 2015లో నాని సరసన ‘జెండాపై కపిరాజు’లో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఆ సినిమా ప్లాప్ అవడంతో టాలీవుడ్‌ను ఫెడ్‌ ఔట్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 8, 2020 / 10:15 AM IST
    Follow us on


    అక్కినేని నాగ చైతన్య హీరోగా 2011లో వచ్చిన ‘బెజవాడ’ మూవీతో టాలీవుడ్‌కు పరిచమైన మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్. ఆ వెంటనే మెగా కాంపౌండ్‌లో అడుగుపెట్టిందామె. రామ్ చరణ్ తేజ్‌ హీరోగా ‘నాయక్’లో ఆడిపాడింది. అల్లు అర్జున్‌ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’లో లీడ్‌ హీరోయిన్‌గా చేసి మెప్పించింది. అయినా సరే తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. చివరగా 2015లో నాని సరసన ‘జెండాపై కపిరాజు’లో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఆ సినిమా ప్లాప్ అవడంతో టాలీవుడ్‌ను ఫెడ్‌ ఔట్‌ అయింది అమలా. అయినా తమిళ్‌, మలయాళంతో పాటు కన్నడ మూవీస్‌తో బిజీగా మారిందామె. డైరెక్టర్ ఎ.ఎల్‌. విజయ్‌తో పెళ్లి, విడాకులు అయినా కూడా నటిగా ఆమె జోరు తగ్గలేదు. ఈ మధ్యే వ్యాపారవేత్త భవీందర్ సింగ్‌ను పెళ్లి చేసుకొని వార్తలోకి వచ్చిందామె.

    జివికె రెడ్డి వ్యాపారాలపై సిబిఐ దాడుల వెనక అసలు ఉద్దేశం ?

    నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన హిందీ సూపర్ హిట్‌ వెబ్‌ సిరీస్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్న ఆమె ఐదేళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో క్రేజీ ఆఫర్ ఆమె సొంతమైందన్న వార్త చక్కర్లు కొడుతోంది. సీనియర్ హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత మళ్లీ జతకట్టిన వీరిద్దరూ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాలయ్య బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేసిన టీజర్ కు అద్భుత స్పందన వచ్చింది. ఈ మూవీలో బాలయ్య రెండు షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడని టాక్‌. దాంతో, సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చాన్స్‌ ఉందట. లీడ్‌ హీరోయిన్‌గా అమలా పాల్‌ సెలెక్ట్‌ అయిందని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. మరో కథానాయికగా కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారట. అయితే, చాన్నాళ్ల తర్వాత అమలా పాల్‌ తెలుగులో స్ట్రెయిట్‌ మూవీ చేస్తున్న విషయం అటు చిత్ర బృందం కానీ… ఇటు అమలా కానీ కన్ఫర్మ్‌ చేయలేదు. మరోవైపు బాలయ్య మూవీకి టైటిల్‌ను ఖరారు చేసేందుకు చిత్ర యూనిట్‌ కరసత్తు చేస్తోంది. తొలుత మోనార్క్, అఘోరా వంటి పేర్లు వినిపించగా.. ఇప్పుడు కథానుసారం సూపర్ మాన్‌ అనే టైటిల్‌ తెరపైకి వచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ షూటింగ్‌ తొందర్లోనే తిరిగి మొదలవనుంది. అప్పుడే హీరోయిన్లతో పాటు టైటిల్‌ గురించి ప్రకటన రానుంది.