ఆ విషయంలో కేసీఆర్ కంటే జగనే బెటర్..!

తెలంగాణా పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జగన్ ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. కరోనా కట్టడిలో ఆయన భేష్ అంటూ కితాబిస్తున్నారు. కరోనా వైరస్ ని అదుపు చేయడంలో సీఎం కేసీఆర్ పనితీరు అద్వాన్నంగా ఉందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జగన్ ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. తెలంగాణా లో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. ప్రతి వంద కరోనా టెస్టులకు 25 నుండి 30 కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న మొత్తంగా […]

Written By: Neelambaram, Updated On : July 8, 2020 9:52 am
Follow us on


తెలంగాణా పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జగన్ ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. కరోనా కట్టడిలో ఆయన భేష్ అంటూ కితాబిస్తున్నారు. కరోనా వైరస్ ని అదుపు చేయడంలో సీఎం కేసీఆర్ పనితీరు అద్వాన్నంగా ఉందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జగన్ ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. తెలంగాణా లో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. ప్రతి వంద కరోనా టెస్టులకు 25 నుండి 30 కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న మొత్తంగా 6200 కరోనా టెస్టులు నిర్వహించగా 1879 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అంటే ప్రతి 10 మందిలో ముగ్గురికి కరోనా సోకిందన్న మాట. ఈ నేపథ్యంలో రానున్న కొద్దిరోజులలో హైదరాబాద్ మరో ముంబైలా తయారవడం ఖాయంగా కనిపిస్తుంది.

జివికె రెడ్డి వ్యాపారాలపై సిబిఐ దాడుల వెనక అసలు ఉద్దేశం ?

ఈ నేపథ్యంలో కరోనా నిర్వహణలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలం చెందాడని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజ మెత్తాడు. కరోనా టెస్టుల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్న కేసీఆర్, రోగులకు మెరుగైన వైద్యం అందించడం లేదు అన్నారు. ప్రక్క రాష్ట్రంలో జగన్ రోజుకు వేలల్లో కరోనా టెస్ట్ ల నిర్వహించడం తో పాటు కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చారు అని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలలో సరైన సౌకర్యాలు లేక అనేక మంది రోగులు మరణిస్తున్నారు అన్నారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించిన వారి ఇల్లు గుల్ల అవుతుంది. రోజుకు రూ. 70 వేల నుండి లక్ష రూపాయల వరకు ప్రయివేటు ఆసుపత్రులు రోగుల నుండి వసూలు చేస్తున్నాయి, అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఏపీలో వారి దాహం తీరనిది.!

తెలంగాణా రాష్ట్రంలో లాక్ డౌన్ సమయంలో కరోనా అదుపులో ఉండగా, సడలింపుల అనంతరం తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా వైరస్ నియంత్రణ ప్రభుత్వానికి అంతుబట్టని విషయంగా మారింది. కరోనా టెస్ట్ లు నిర్వహించే కొలది, కేసులు బయటపడుతున్నాయి. కరోనా విషయంలో కేసీఆర్ వైఖరిని ఆ రాష్ట్ర గవర్నర్ తమిళసై సైతం తప్పుబట్టారు. కరోనా నిర్వహణలో అలసత్వం పనికిరాదని, ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కి గవర్నర్ కి మధ్య విభేదాలు తెలెత్తినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కేసీఆర్ కనిపించక పోవడం, ఆయనకు కరోనా సోకిందని ప్రచారం జరగడం ఆందోళన రేపుతోంది. దీన్ని ఆసరాగా తీసుకొని కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు.