ఈ సందర్భంగా మేఘా ఆకాష్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లోనే.. “రాజ రాజ చోర” తర్వాత ”డియర్ మేఘ” చిత్రం విడుదల అవ్వడం నాకు చాలా ప్లస్ పాయింట్. ముఖ్యంగా నాకు ఈ సినిమా మంచి పేరు తెస్తోంది అని భావిస్తున్నాను. ఎందుకంటే.. ఈ సినిమా డైరెక్టర్ సుశాంత్ రెడ్డి నా కోసం ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ రెడీ చేసి ఈ సినిమా చేశాడు.
అయితే, నేను కథ మొత్తం విన్న తర్వాతే ఈ సినిమా చేశాను. ఇది కొత్త కథ, ఇలాంటి కథలు చెయ్యాలంటే ధైర్యం కావాలి. అందుకే ఇది డ్రీమ్ ప్రాజెక్ట్. అన్ కండిషనల్ లవ్ అంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు. జెన్యూన్ లవ్ ను ఈ చిత్రంలో మీరు చూస్తారు. కచ్చితంగా ఆ లవ్ ఎమోషన్ ను ప్రేక్షకులు బలంగా ఫీల్ అవుతారు.
ఎందుకంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఉంటుంది. అందరూ ఏదొక సమయంలో ప్రేమలో పడుతారు. నేను కూడా ఒకప్పుడు ప్రేమలో పడ్డాను, అది నా లైఫ్ లోనూ జరిగింది. ఇక డియర్ మేఘ సినిమా విషయానికి వస్తే.. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇంతకీ డియర్ మేఘ అని టైటిల్ పెట్టడానికి రీజన్ నా పాత్రలోని వైవిధ్యమే.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర లోపల చాలా అల్లరి పిల్ల, అయితే బయటకు మాత్రం చాలా కామ్ గా కూల్ గా కనిపిస్తోంది. ఒక విధంగా నేనూ అంతే.. పర్సనల్ గా చాలా అల్లరి చేసినా.. అందరి మధ్య మాత్రం కామ్ గా ఉంటాను. ఇక నా పర్సనల్ లవ్ మేటర్ విషయానికి వస్తే.. నేను ఖచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటాను’ అంటూ ‘మేఘా ఆకాష్’ తెలిపింది.