అయితే, నాగార్జున ఈ చిత్రంలో ‘విక్రమ్ గాంధీ’ అనే పవర్ ఫుల్ పాత్రను చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ‘ఘోస్ట్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే నాగార్జున ఇమేజ్ కి ఇలాంటి టైటిల్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. నాగ్ ఫ్యాన్స్ మాత్రం నాగార్జున నుంచి కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.
కథ ప్రకారం దర్శకుడు ప్రవీణ్ సత్తారు, నాగార్జున పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేసాడట. ఆ మధ్య ఈ సినిమాలోని నాగార్జున లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. వైరల్ అయిన లుక్ లో నాగార్జున పూర్తిగా రఫ్ లుక్ లో, పెరిగిన మీసకట్టుతో కనిపించి మొత్తానికి అందరికి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చాడు.
మరి రేపు రిలీజ్ కాబోయే లుక్ తో ఇక ఎలాంటి సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
మొత్తానికి నాగార్జున ఈ సారి భారీ విజయాన్ని అందుకోవాలని ఈ సినిమాకి కాస్త గట్టిగానే కష్టపడుతున్నాడు. ఇక నాగార్జున ఈ సినిమాతో పాటు ప్రస్తుతం “బంగార్రాజు” సినిమాని కూడా చేస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. మరి బంగార్రాజు సినిమా ఎలాంటి నాగ్ బర్త్ డేకి ఎలాంటి గిఫ్ట్ వస్తోందో చూడాలి.