Godfather: మెగా అభిమానులకు మరో 15 రోజుల్లో పెద్ద పండగ రానుంది..ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా తెలుగు మరియు హిందీ బాషలలో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5 వ తేదీన ఘనంగా విడుదల కాబోతుంది..ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన మెగాస్టార్ ఆచార్య చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..దాదాపుగా 140 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి కనీసం 50 కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోయింది..ఇది చిరంజీవి కెరీర్ లోనే ఒక బ్లాక్ మార్కు గా చెప్పుకోవచ్చు..దీనితో మెగా అభిమానులు గాడ్ ఫాదర్ సినిమా ని ఎలా అయినా బ్లాక్ బస్టర్ హిట్ చేసుకోవాలి అనే కసితో ఉన్నారు..కనీసం యావరేజి టాక్ వచ్చిన అవలీల గా వంద కోట్ల రూపాయిల షేర్ వచ్చేస్తుంది..దీనితో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా దుమ్ము లేపేస్తుంది.

ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కేవలం తెలుగు రైట్స్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందని సమాచారం..మెగాస్టార్ రేంజ్ కి ఇది కాస్త తక్కువే అయ్యినప్పటికీ గత చిత్రం ఆచార్య ప్రభావం గాడ్ ఫాదర్ మీద కాస్త పడిందని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త..ఇక సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ మెగాస్టార్ కూడా ఈ సినిమాలో ఉండడం తో హిందీ వెర్షన్ లో కూడా మంచి రేట్ కి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది..హిందీ రైట్స్ ఈ సినిమాకి దాదాపుగా 20 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగినట్టు సమాచారం.

టాక్ వస్తే ఇక్కడ కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటుతుంది..ఇక డిజిటల్ రైట్స్ ని హిందీ మరియు తెలుగు భాషలకు కలిపి నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు 57 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు సమాచారం..మొత్తం మీద డిజిటల్ + సాటిలైట్ రైట్స్ ఈ సినిమాకి 100 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగిందట..మొత్తం మీద ఈ సినిమాకి థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ కలిపి 200 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగినట్టు సమాచారం..ఒక రీమేక్ సినిమాకి ఈ స్థాయి బిజినెస్ జరగడం మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ కి నిదర్శనం అని అంటున్నారు ట్రేడ్ పండితులు..విడుదలకు ముందే ఈ స్థాయి రికార్డ్స్ ని సృష్టించిన ఈ చిత్రం విడుదల తర్వాత ఇంకా ఎన్ని ప్రభంజనాలు సృష్టిస్తుందో చూడాలి.