Vijay Devarakonda Liger: యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ చిత్రం లైగర్ ఈ ఏడాది అన్ని ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాగా నటించినప్పటికీ కూడా డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్లక్ష్యం వల్ల విజయ్ దేవరకొండ విలువైన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది..సుమారు 90 కోట్ల రూపాయిల వరుకు ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదంటే ఈ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు..తెలుగు లో ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ హిందీ లో మాత్రం విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ వల్ల సూపర్ హిట్ గా నిలిచింది అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు.

హిందీ లో ఒక రోజు ఆలస్యం గా విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజే దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి..అలా మొదటి రోజు నుండే స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోయిన ఈ సినిమాకి ఫుల్ రన్ లో దాదాపుగా 25 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి..ఒక డిజాస్టర్ ఫ్లాప్ సినిమాకి హిందీ లో ఈ స్థాయి వసూళ్లు వచ్చాయి అంటే అక్కడ విజయ్ దేవరకొండ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..ఈ సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ 9 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది..25 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి 12 కోట్ల రూపాయిలు నెట్ వసూళ్లు వచ్చాయట.

అంటే పెట్టిన డబ్బులకు మూడు కోట్ల రూపాయిలు లాభాలు వచ్చాయి అన్నమాట..ఈ ఏడాది ప్రభాస్ హీరో గా నటించిన భారీ బడ్జెట్ సినిమా రాధే శ్యామ్ కి ఫుల్ రన్ లో కేవలం 22 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి..కానీ విజయ్ దేవరకొండ లైగర్ కి రాధే శ్యామ్ కంటే ఏక్కువ వసూళ్లు రావడం చూస్తుంటే హిందీ లో విజయ్ దేవరకొండ కి ఇంత క్రేజ్ ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది..సరైన సినిమా తో బాలీవుడ్ లోకి వెళ్తే విజయ్ దేవరకొండ ప్రభంజనం మాములు గా ఉండదు అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.