Bro Movie- Chiranjeevi: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా నే కనిపిస్తుంది. ‘భీమ్లా నాయక్’ సినిమా తర్వాత ఆయన నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సందర్భంలో మూవీ యూనిట్ మొత్తం ప్రొమోషన్స్ ఫుల్ బిజీ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ప్రొమోషన్స్ లో పాల్గొనలేదు కానీ, ఈ సినిమాలో మరో హీరో గా నటించిన సాయి ధరమ్ తేజ్ మాత్రం క్షణం తీరిక లేకుండా ప్రొమోషన్స్ లో పాల్గొంటున్నాడు.
ఎక్కడ చూసిన ఆయన ఇంటర్వ్యూస్ కి సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 25 వ తారీఖున హైదరాబాద్ శిల్ప కళావేదిక లో జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది.
అయితే ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమా ని చిరంజీవి , రామ్ చరణ్ మరియు కుటుంబ సభ్యులు మొత్తం విడుదల రోజే ఏఎంబీ సినిమాస్ లో చూడబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే ఉండవు. గతం లో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని కూడా చిరంజీవి కుటుంబం మొత్తం వచ్చి స్పెషల్ షో చూసి, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్నీ పంచుకున్నాడు.
అభిమానులు అది చూసి ఎంతో సంతోషించారు. ఇప్పుడు మళ్ళీ అలాగే చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. మరో విశేషం ఏమిటంటే పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రానికి, మరియు చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాకి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఇలా ఇంత తక్కువ గ్యాప్ తో అన్నదమ్ముల సినిమాలు రావడం ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు.