అభిజిత్‌ మెగాస్టార్‌‌కు అందుకే నచ్చాడా..!

వరల్డ్‌ బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ 4వ సీజన్‌ నిన్న గ్రాండ్‌గా ముగిసింది. మొత్తానికి నిన్న గ్రాండ్ ఫినాలేలో ఎన్నో సర్‌‌ప్రైజ్ ఎలిమెంట్స్ తో సిసలైన బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీతో అంతే గ్రాండ్‌గా కొనసాగింది. గత సీజన్ ను గ్రేస్ చేసిన మెగాస్టార్ ఈసారి కూడా తనదైన రీతిలో ఎంటర్‌‌టైన్ చేశారు. Also Read: సోహైల్ తొందరపాటు నిర్ణయం అయితే.. ఈసారి బిగ్‌బాస్‌ విన్నర్‌‌ ఎవరనేది ముందుగానే వైరల్‌ అయింది. దీంతో టైటిల్‌ విన్నర్‌గా […]

Written By: Srinivas, Updated On : December 21, 2020 1:50 pm
Follow us on


వరల్డ్‌ బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ 4వ సీజన్‌ నిన్న గ్రాండ్‌గా ముగిసింది. మొత్తానికి నిన్న గ్రాండ్ ఫినాలేలో ఎన్నో సర్‌‌ప్రైజ్ ఎలిమెంట్స్ తో సిసలైన బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీతో అంతే గ్రాండ్‌గా కొనసాగింది. గత సీజన్ ను గ్రేస్ చేసిన మెగాస్టార్ ఈసారి కూడా తనదైన రీతిలో ఎంటర్‌‌టైన్ చేశారు.

Also Read: సోహైల్ తొందరపాటు నిర్ణయం

అయితే.. ఈసారి బిగ్‌బాస్‌ విన్నర్‌‌ ఎవరనేది ముందుగానే వైరల్‌ అయింది. దీంతో టైటిల్‌ విన్నర్‌గా అభిజిత్‌ను ప్రజలు కూడా ఎప్పుడో నిర్ణయించారు. అయితే.. అభిజిత్‌కు ఈ రేంజ్‌ ఫాలోయింగ్‌ ఎలా వచ్చింది..? ఎందుకు వచ్చింది..? సరిగా ఇదే అంశంపై మెగాస్టార్‌‌ చిరు కూడా రివీల్‌ చేశారు. అభిజిత్ ఈ సీజన్‌లో చాలా సెటిల్డ్ గా.. ఎమోషన్స్ కంట్రోల్ చేస్తూ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నాడు.. అదే అతన్ని ఇష్టపడేలా చేసిందని.. చివరికి టైటిల్ విన్నర్‌‌గా నిలిపిందని చెప్పుకొచ్చారు.

Also Read: ఎవరి లెక్కలు వారివి..

అతడి యాటిట్యూడ్ వల్ల గ్రాఫ్ పెంచుకున్నాడే తప్ప చివరి నిమిషం వరకు తగ్గింది లేదు. మరి ఇదే విషయాన్ని మెగాస్టార్ కూడా టైటిల్ ప్రెజెంట్ చెయ్యకముందే చెప్పేశారు. అఖిల్, అభిజిత్‌ల కోసం ముందు మాట్లాడే సమయంలో అభిజిత్ ఆట కోసం స్పెషల్ గా మెన్షన్ చేశారు. అది అతన్ని ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని చెప్పారు. కొన్ని పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలి అన్నది చాలా ముఖ్యమని.. అది అభిజిత్‌లో చూసినట్టుగా చిరు తెలిపారు. మొత్తానికి చిరుకి కూడా అభిజిత్‌లో ఈ విషయమే బాగా నచ్చిందని చెప్పాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్