https://oktelugu.com/

క్రేజీ అప్డేట్: కెజిఎఫ్ 2 టీజర్ డేట్ వచ్చేసింది

2018లో సంచలన విజయం సాధించిన కెజిఎఫ్ కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న కెజిఎఫ్ 2 చిత్రంపై ప్రేక్షకులలో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని అన్ని పరిశ్రమల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొని ఉంది. మొదటి భాగం అత్యంత ప్రజాదరణ పొందగా… కెజిఎఫ్ 2 అంతకు మించి ఉంటున్నదన్న భావన ప్రేక్షకులలో నెలకొంది. కెజిఎఫ్ 2 అక్టోబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. లాక్ డౌన్ వలన షూటింగ్ వాయిదా పడిన నేపథ్యంలో ఆలస్యం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 21, 2020 / 01:30 PM IST
    Follow us on


    2018లో సంచలన విజయం సాధించిన కెజిఎఫ్ కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న కెజిఎఫ్ 2 చిత్రంపై ప్రేక్షకులలో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని అన్ని పరిశ్రమల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొని ఉంది. మొదటి భాగం అత్యంత ప్రజాదరణ పొందగా… కెజిఎఫ్ 2 అంతకు మించి ఉంటున్నదన్న భావన ప్రేక్షకులలో నెలకొంది. కెజిఎఫ్ 2 అక్టోబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. లాక్ డౌన్ వలన షూటింగ్ వాయిదా పడిన నేపథ్యంలో ఆలస్యం అయ్యింది.

    Also Read: వకీల్ సాబ్ లో పవన్, శృతి అలా కనిపించారు… లీకైన ఫోటో!

    కాగా ఈ మూవీ నుండి కీలక అప్డేట్ చిత్ర యూనిట్ నేడు ఇచ్చారు. కెజిఎఫ్ టీజర్ విడుదల తేదీ ప్రకటించారు. 2021 జనవరి 8న ఉదయం 10:18 నిమిషాలకు కెజిఎఫ్ 2 టీజర్ విడుదల కానుంది. దీనితో కెజిఎఫ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమాపై ఉన్న హైప్ రీత్యా ప్రతి అప్డేట్ సంచలనంగా మారుతుంది. కెజిఎఫ్ టీజర్ ఖచ్చితంగా రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం అని అప్పుడే అంచనా వేస్తున్నారు.

    Also Read: తెలుగు సినిమా భవిష్యత్తు సాయి తేజ్,రవితేజ డిసైడ్ చేస్తారా ?

    ఇక కెజిఎఫ్ 2 షూటింగ్ చాలా భాగం హైదరాబాద్ లోనే షూట్ చేశారు. దాదాపు చిత్రీకరణ పార్ట్ పూర్తికాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. మొదటి భాగానికి మించి అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉన్నాయి. హీరో యష్ ని ఎదుర్కొనే విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. కెజిఎఫ్ 2 లో మెయిన్ విలన్ అధీరాగా ఆయన కనిపించనున్నారు. రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక రోల్స్ చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ అందరి అంచనాలకు మించి కెజిఎఫ్ 2 తెరకెక్కించారని సమాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్