https://oktelugu.com/

Rebel Star: రెబల్ స్టార్ కి  మెగాస్టార్  జన్మదిన శుభాకాంక్షలు  !

Rebel Star:  రెబల్ స్టార్  కృష్ణంరాజు  ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తమ అభిమాన కథానాయకుడికి శుభాకాంక్షలు తెలియజేయడానికి  అభిమానులతో పాటు  సినీ ప్రముఖులు  కూడా పోటీ పడ్డారు.  తాజాగా  మెగాస్టార్ చిరంజీవి కూడా  రెబల్ స్టార్ కృష్ణంరాజుకు  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సందర్భంగా మెగాస్టార్ ఒక ట్వీట్ చేశారు. ఇంతకీ మెగాస్టార్ ఏమి ట్వీట్ చేశారు అంటే.    ‘సోదర సమానుడు, తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి రెబల్ స్టార్, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా అడుగిడిన […]

Written By: , Updated On : January 20, 2022 / 05:58 PM IST
Follow us on

Rebel Star:  రెబల్ స్టార్  కృష్ణంరాజు  ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తమ అభిమాన కథానాయకుడికి శుభాకాంక్షలు తెలియజేయడానికి  అభిమానులతో పాటు  సినీ ప్రముఖులు  కూడా పోటీ పడ్డారు.  తాజాగా  మెగాస్టార్ చిరంజీవి కూడా  రెబల్ స్టార్ కృష్ణంరాజుకు  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సందర్భంగా మెగాస్టార్ ఒక ట్వీట్ చేశారు. ఇంతకీ మెగాస్టార్ ఏమి ట్వీట్ చేశారు అంటే.    ‘సోదర సమానుడు, తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి రెబల్ స్టార్, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా అడుగిడిన ప్రతి రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన కృష్ణంరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. 

Also Read: Watermelon: వావ్.. పుచ్చ కాయ వల్ల ఇన్ని లాభాలా ?

 
మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని శుభాకాంక్షలు  తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.  ఇక ప్రభాస్  ఫ్యాన్స్ కూడా  కృష్ణంరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ  సోషల్ మీడియాలో రకరకాల మెసేజ్ లు పోస్ట్ చేశారు. మరి వారి శుభాకాంక్షలు ఎలా ఉన్నాయో  చూద్దామా. 
మంచి మనసు ఉన్న మా  కృష్ణంరాజు గారు   మంచి  సుగుణాలన్నీ  ఉన్న వ్యక్తి .   ఒక నటుడిగా   రెబల్  స్టార్‌ అనిపించుకున్నారు.    హ్యాపీ బర్త్‌ డే  కృష్ణంరాజు గారు,  ఒక్క  మా తరానికే కాదు. రానున్న భవిష్యత్తు తరాలకు కూడా  మీరే ఇన్స్పిరేషన్ గా ఉంటారు అంటూ రెబల్  స్టార్ కి విషెస్ చెబుతున్నారు. ఇక  1940లో  జనవరి 20న కృష్ణంరాజు   జన్మించారు.   1970, 1980లలో స్టార్ హీరోగా ఆయన తన హవాని కొనసాగించారు.   మొత్తం  183 తెలుగు సినిమాలలో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి గొప్ప  పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.   
Tags