Shruti Haasan: ‘శృతి హాసన్’ చాలా బోల్డ్. ఐటమ్ సాంగ్స్ చేసే భామలు కూడా ‘శృతి’ రేంజ్ లో బోల్డ్ గా ఉండలేరు. ‘శృతి హాసన్’ అంత బోల్డ్ గా ఉంటుంది. డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో పబ్లిక్ గా తిరుగుతూ.. ఆ మధ్య ఒకసారి అతని పెదవులను ముద్దాడుతూ ఫోజులు ఇచ్చి మరి “నేను అతనితో లివిన్ రిలేషన్ షిప్ లో ఉంటాను…కానీ ఎప్పటికీ పెళ్లి మాత్రం చేసుకోను’ అంటూ పబ్లిక్ గా చెబుతుంది. ఇలా చెప్పగలడం బహుశా ఒక్క ‘శృతి హాసన్’కే చెల్లింది.
Shruti Haasan
అదేంటో.. మొదటి నుంచి శృతి హాసన్ కి పెళ్లి అంటే అస్సలు ఇష్టం లేదు. శృతి వయసు ప్రస్తుతం 35 ఏళ్ళు. మరో రెండేళ్లు దాటితే.. ఇక ఆమె ఆంటీ వయసుకి వచ్చేసినట్లే. అయినా ఎందుకో ఇప్పటికీ ‘శృతి హాసన్’కి మాత్రం పెళ్లి ఆలోచన లేదు. పైగా తన బాయ్ ఫ్రెండ్స్ వివరాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ.. వారితో పబ్లిక్ గా తిరుగుతూ దీనికితోడు సోషల్ మీడియాలో చాలా ఘాటు ఫోటోలు అప్ లోడ్ చేస్తూ ముందుకు పోతుంది ఈ బ్యూటీ.
Also Read: రెబల్ స్టార్ కి మెగాస్టార్ జన్మదిన శుభాకాంక్షలు !
‘శృతి హాసన్’ డేటింగ్ లిస్ట్ చాలా పెద్దది. ఆమె గతంలో సిద్ధార్థ్, నాగ చైతన్య, మైకేల్ కొర్సాల్ ఇలా పలువురితో ఫుల్ డేటింగ్ చేసి..వారితో ఫారిన్ ట్రిప్ లకు వెళ్లి ఎన్నో మధురానుభూతులను సంపాదించింది. కానీ, పెళ్లి అనేది తనకు సెట్ అవ్వదు అంటుంది. అదేంటి ? బాయ్ ఫ్రెండ్లు సెట్ అయినప్పుడు పెళ్లి ఎందుకు సెట్ కాదు ? పైగా ఆ విషయాలు కూడా ఎప్పుడూ దాచుకోకుండా చెప్పిన ‘శృతి హాసన్’ మాత్రం, పెళ్లి ప్రస్తావన తెస్తే కస్సుమని కోపం తెచ్చుకుని తెగ సీరియస్ అయిపోతుంది.
ఆమె లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికా. అతనితో మీ పెళ్లి ఎప్పుడు అంటూ తాజాగా ఓ పత్రిక అడిగింది. అయితే, ‘శృతి హాసన్’ మాత్రం ‘దయచేసి పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు అని ఖరాఖండీగా చెప్పడంతో పాటు నా జీవితంలో పెళ్లి లేదు. కేవలం రిలేషన్స్ మాత్రమే ఉంటాయి అంటూ ‘శృతి హాసన్’ మళ్ళీ ఘాటుగా సమాధానం చెప్పింది. మొత్తమ్మీద పెళ్లి కాన్సెప్ట్ కి తాను పూర్తి వ్యతిరేకం అంటూ ‘శృతి హాసన్’ ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తోంది.
Also Read: పూరి మ్యూజింగ్స్: హాలీవుడ్ ఎలా పుట్టిందో తెలుసా ?