Megastar Chiranjeevi Emotional: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.. రష్యా భయంకరమైన రీతిలో ఉక్రెయిన్ పై యుద్ధం సాగిస్తుంది. రష్యా దాడికి అక్కడి నగరాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి.. అలాగే రస్యా సైన్యం ధాటికి అక్కడి భవనాలు కూడా నామరూపాలు లేకుండా ధ్వంసం అవుతున్నాయి.. ఉక్రెయిన్, రష్యా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అక్కడి భారతీయులను ఆపరేషన్ గంగా పేరుతో పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుస్తున్నారు.

ఇప్పటికే వేల మంది భారతీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా ఎంతో మంది ప్రజలు అక్కడే చిక్కుకు పోయారు.. కొంతమంది ఆ దేశాన్ని విడిచి రాలేక మరికొంత మంది కదలలేని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోయారు. అలాంటి వారిలో అక్కడే స్థిరపడ్డ మన తెలుగు వైద్యుడు కూడా ఉన్నారు.
ఆయన ఉక్రెయిన్ లో మెడిసిన్ చదివి అక్కడే డాక్టర్ గా స్థిరపడిపోయారు. ఆయన పేరు డాక్టర్ గిరి కుమార్. ఇండియాకు తాను రాలేనని ఒక వీడియో ద్వారా చెప్పారు. అందుకు కారణం కూడా ఆయన వివరించారు.. ఆయన ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న జాగ్వార్, ఒక పాంథర్ అట.. ఆయన ఇండియాకు తిరిగి వస్తే అవి తిండి లేక చచ్చిపోతాయని అందుకే రాలేనని ఆవేదన వ్యక్తం చేశారు.
చిరంజీవి లంకేశ్వరుడు సినిమాకు ప్రేరణగా ఆయన మూగజీవాలను పెంచుకుంటున్నట్టు చెప్పి ఎంతో మంది హృదయాలను కదిలించాడు. మూగ జీవాల కోసం ఆయన తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అక్కడే ఉండి పోతానని చెప్పడంతో చాలా మంది ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతూ అభినందిస్తున్నారు. ఈ వీడియోపై చిరంజీవి కూడా స్పందించారు.

ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేస్తూ.. గౌరవడాక్టర్ గిరికుమార్ గారు.. మీకు మీ పెంపుడు జంతువులు అయిన జాగ్వార్, పాంథర్లపై మీకున్న ప్రేమ నన్ను టచ్ చేసింది అంటూ చిరు ఎమోషనల్ అయ్యారు. అంతే కాకుండా తన ట్వీట్ లో ఇలా రాసుకొచ్చారు. మీరు చేస్తున్న పని నాలో స్ఫూర్తిని నింపిందని, అక్కడ నెలకొన్న పరిస్థితులు చూసి కూడా మన దేశానికి రాకుండా ఉండిపోవడం నిజంగా హృదయాన్ని హత్తుకునే విషయమని చెప్పుకొచ్చారు. మీరు అక్కడ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను.. గాడ్ బ్లెస్ యూ’ అని ట్వీట్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది.