Homeజాతీయ వార్తలుMLA Raja Singh Sensational Comments: యూపీ బుల్డోజర్లు తెలంగాణకు తెస్తామంటున్న బీజేపీ

MLA Raja Singh Sensational Comments: యూపీ బుల్డోజర్లు తెలంగాణకు తెస్తామంటున్న బీజేపీ

MLA Raja Singh Sensational Comments: దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బీజేపీ నేతల్లో జోష్ పెరుగుతోంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడంతో కాషాయ దళం సంతోషాలకు అవధులు లేకుండా పోతోంది. దేశంలోనే గుండెకాయగా పేరున్న యూపీలో అధికారం చేపట్టడం ఖాయం కావడంతో హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదివరకే ఆయన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఆదిత్య నాథ్ కు ఓటు వేయకపోతే బుల్డోజర్లతో ఇళ్లు కూల్చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

MLA Raja Singh
MLA Raja Singh

ఇప్పుడు మరోమారు అదే తీరుగా వ్యాఖ్యలు చేసి అందరిలో ఆశ్చర్యం వచ్చేలా చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొనడం విశేషం. రాష్ర్టంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బుల్డోజర్లతో ఎదుర్కొనేందుకు తయారుగా ఉన్నామని చెప్పడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో బీజేపీకి ఎదురులేదని చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అధికార దాహమో విజయగర్వమో కానీ రాజాసింగ్ మాటలు అందరిలో సంశయాలు వచ్చేలా ఉండటం గమనార్హం.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో బీజేపీ విజయం సాధించింది. పంజాబ్ లో మాత్రం ఆప్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. దీంతో బీజేపీ నేతల్లో పట్టరాని సంతోషం వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే రాజాసింగ్ బుల్డోజర్ల గురించి మాట్లాడి వివాదాలకే తెరలేపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పాటుపడాల్సింది ఆయనే గొడవలకు తెరలేపే విధంగా మాట్లాడటంతో బీజేపీ నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సమాలోచనలు చేస్తున్నారు.

MLA Raja Singh Sensational Comments
MLA Raja Singh Sensational Comments

మరోవైపు ఉత్తరప్రదేశ్ లో ఎంఐఎంతో రహస్య ఒప్పందం మేరకే అక్కడ పోటీ చేయించారనే ఆరోపణలను ఎమ్మెల్యే రాజాసింగ్ కొట్టిపారేశారు. ఎంఐఎం ఎప్పటికి తమకు మితృత్వ పార్టీ కాదని అన్నారు. బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తుందని ఏ పార్టీతో ఒప్పందం కుదుర్చుకోదని తేల్చి చెప్పారు. దీనిపై అనవసర ఆరోపణలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో తమదే అధికారం అని జోస్యం చెప్పారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

5 COMMENTS

  1. […] UP CM Adityanath Yogi: దేశంలో అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఈనేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి యూపీ కాబోయే సీఎం ఆదిత్యనాథ్ పై పడుతోంది. రాబోయే కాలంలో కాబోయే ప్రధానిగా యోగిని సూచిస్తున్నారు. దీనికి అమిత్ షా సైతం సహజంగానే అభివర్ణిస్తున్నారు. దీంతో యోగిపై గురుతర బాధ్యత ఉందని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరనేదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంలో ఓ అంచనాకు రాలేకపోతున్నారు. […]

  2. […] Role Of Opposition Party In India:  క్షేత్రస్థాయిలో ఎన్ని వ్యతిరేక సంఘటనలు జరిగినా..? బీజేపీని రైతులు, ఇతర వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నా కానీ.. ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుంది. యూపీలో రైతులను బీజేపీ కేంద్రమంత్రి కొడుకు తొక్కి చంపినా కూడా అక్కడ ఆ పార్టీనే గెలిపించేశారు. ప్రజలు కేవలం సమర్థ నాయకత్వం, అభివృద్ధి, సంక్షేమం, పాలన మాత్రమే చూస్తున్నారని ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలతో క్లియర్ కట్ గా అర్థమైంది. ప్రస్తుత పరిస్థితులకు దేశంలో బలంగా ప్రతిపక్షం లేకపోవడం కూడా కారణం.. బీజేపీకి పోటీగా కనుచూపు మేరలో కాంగ్రెస్ బలంగా లేకపోవడం కూడా బీజేపీకి ఎదురులేకుండా చేస్తోంది. ఇన్ని గెలుపుల తర్వాత ఇక బీజేపీని ప్రశ్నించే నాథుడు దేశంలో ఉంటాడా? అన్నది ప్రశ్న. […]

  3. […] BJP Success Secret: దేశంలోని అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ విజయతీరాలు చేరుకుంది. బ్రహ్మాండమైన మెజార్టీ సాధించి అందరి అంచనాలు తలకిందులు చేసింది. దీనికి జాతయ నేతల కృషే అని చెప్పక తప్పదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ద్వయం రాష్ట్రంలో పార్టీని విజయఢంకా మోగించేందుకు సమాయత్తం చేసినట్లు తెలుస్తోంది. వారు రచించిన వ్యూహాలే పార్టీకి ఊపునిచ్చాయని చెబుతున్నారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి అధికారం దక్కించుకునేందుకు భాగస్వాములు కావడం తెలిసిందే. […]

  4. […] Trolls On Rahul Gandhi: దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. వీటిని వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అని ముందు నుంచే అందరూ చెబుతున్నారు. అయితే ఈ ఫలితాలు కాంగ్రెస్ భవిష్యత్తును అని తేల్చి పారేశాయి. మరీ ముఖ్యంగా ఈ ఫలితాలను చూసి అందరూ రాహుల్ గాంధీ ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. […]

  5. […] PM Narendra Modi: ప్రధాని మోడీ హవా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వయసు మీద పడుతున్నా సరే యువకుడిలా మరింత ఉత్సాహంగా పని చేస్తున్నారు. ఆయన పనితనానికి నిదర్శనమే నిన్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపు. దీంతో మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు కాషాయ అగ్రనేత. ఇదే ఊపులో ఇప్పుడు మరో రెండు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular