https://oktelugu.com/

నాగబాబును అభినందించిన మెగాస్టార్.. ఎందుకో తెలుసా?

నిర్మాతగా.. నటుడిగా మెగా బ్రదర్ నాగబాబుకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అన్నయ్యగా నాగబాబుకు అభిమానుల్లో మంచి ఆదరణ ఉంది. నాగబాబు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై పలు కామెడీ షోలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. Also Read: మహేష్ లేకుండానే ‘సర్కారువారిపాట’.. వర్కౌట్ అయ్యేనా? అయితే మెగాబ్రదర్ నాగబాబును ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఇటీవల నాగబాబు కరోనా బారిన […]

Written By:
  • NARESH
  • , Updated On : October 15, 2020 / 08:13 PM IST
    Follow us on

    నిర్మాతగా.. నటుడిగా మెగా బ్రదర్ నాగబాబుకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అన్నయ్యగా నాగబాబుకు అభిమానుల్లో మంచి ఆదరణ ఉంది. నాగబాబు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై పలు కామెడీ షోలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

    Also Read: మహేష్ లేకుండానే ‘సర్కారువారిపాట’.. వర్కౌట్ అయ్యేనా?

    అయితే మెగాబ్రదర్ నాగబాబును ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఇటీవల నాగబాబు కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజుల హోంక్వారంటైన్లో ఉంచి చికిత్స తీసుకున్న నాగబాబు కరోనాను జయించారు. ఈనేపథ్యంలో నాగబాబు చిరంజీవి చారిట్రబుల్ ట్రస్టుకు ప్లాస్మా దానం చేశాడు.నాగబాబు ప్లాస్మా దానం చేయడంపై చిరంజీవి స్పందించారు.

    నాగబాబును అభినందిస్తూ చిరంజీవి తన ట్వీటర్లో ట్వీట్ చేశాడు. ‘కోవిడ్‌ 19తో పోరాడి గెలవటమే కాదు.. ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో.. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌లో ప్లాస్మా డొనేట్‌ చేసిన తమ్ముడు నాగబాబుకి అభినందనలు.. ఈ సందర్భంగా కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మరోమారు నా విన్నపం.. మీరు ప్లాస్మా దానం చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు.. దయచేసి ముందుకు రండి.. ప్లాస్మా దానం చేయండి..’ అంటూ కోరాడు.

    Also Read: ‘ఆచార్య’ చిరంజీవి మౌనం.. కొరటాలకు శాపంగా మారనుందా?

    నాగబాబు ప్లాస్మాదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలువడంపై మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు నాగబాబును అభినందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతీఒక్కరు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకొచ్చి మానవత్వాన్ని చాటాలని అభిమానులు కోరుతున్నారు.