https://oktelugu.com/

ఆ వైరస్ కు వ్యాక్సిన్ సక్సెస్.. చికిత్సకు అనుమతులు ఇచ్చిన అమెరికా

ప్రపంచ దేశాలు ప్రస్తుతం వైరస్ అనే మాట వింటే కరోనా వైరస్ మాత్రమే వైరస్ అనే భావనలో ఉన్నారు. అయితే కరోనా వైరస్ కు ముందే అనేక వైరస్ లు శరవేగంగా వ్యాప్తి చెంది ప్రజలను ముప్పుతిప్పలు పెట్టాయి. అలా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన వైరస్ లలో ఎబోలా వైరస్ ఒకటి. భారత్ పై ఎబోలా వైరస్ ప్రభావం లేకపోయినా ఆఫ్రికా దేశాల ప్రజలు ఈ వైరస్ వల్ల పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 15, 2020 / 08:07 PM IST
    Follow us on

    ప్రపంచ దేశాలు ప్రస్తుతం వైరస్ అనే మాట వింటే కరోనా వైరస్ మాత్రమే వైరస్ అనే భావనలో ఉన్నారు. అయితే కరోనా వైరస్ కు ముందే అనేక వైరస్ లు శరవేగంగా వ్యాప్తి చెంది ప్రజలను ముప్పుతిప్పలు పెట్టాయి. అలా ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన వైరస్ లలో ఎబోలా వైరస్ ఒకటి. భారత్ పై ఎబోలా వైరస్ ప్రభావం లేకపోయినా ఆఫ్రికా దేశాల ప్రజలు ఈ వైరస్ వల్ల పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

    చాలా రోజుల క్రితమే అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఎబోలాకు ఔషధాన్ని కనిపెట్టారు. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ తాజాగా ఆ ఔషధాన్ని ఎబోలా రోగులకు వినియోగించడానికి అనుమతులు ఇచ్చింది. రీజెనరాన్ అనే ఫార్మా కంపెనీ ఈ ఔషధాన్ని తయారు చేసింది. 2019 సంవత్సరం జూన్ నెలలో ఆఫ్రికాలోని కాంగో అనే ప్రాంతంలో 2,300 మంది ఎబోలా వైరస్ బారిన పడి మృతి చెందారు.

    అనంతరం శాస్త్రవేత్తలు ఎబోలా వైరస్ ను కట్టడి చేయడానికి అనేక ప్రయోగాలు చేయగా రీజెనరాన్ సంస్థ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఇన్ మాజెబ్ అనే ఔషధం క్లినికల్ ట్రయల్స్ లో అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ డ్రగ్ కు గతేడాది ఆమోద ముద్ర లభించగా ప్రస్తుతం చికిత్సలో డ్రగ్ ను వినియోదించడానికి అనుమతులు లభించాయి. ఎబోలా వైరస్ ఒకరి శరీరాన్ని మరొకరు తాకడం వల్ల వ్యాపిస్తుంది.

    మృతదేహాల ద్వారా, శరీరంలోని ద్రవాల ద్వారా కూడా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని తెలుస్తోంది. పురుషుల్లోని శుక్రకణాల నుంచి కూడా వైరస్ సోకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే డ్రగ్ అందుబాటులోకి ఎబోలాకు చెక్ పెట్టినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.