టీవీ డిబెట్లు పెట్టి అందరినీ ఏకిపారేసే రిపబ్లిక్ ఛానల్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామికి తాజాగా సుప్రీం కోర్టు భారీ షాకిచ్చింది. ఇటీవల టీఆర్పీ స్కామ్ ను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. రిపబ్లిక్ ఛానల్ తోపాటు పలు ఛానళ్లకు పోలీసులు సమన్లు జారీ చేశారు. దీనిపై ఆర్నాబ్ గోస్వామి తాజాగా సుప్రీంను ఆశ్రయించాడు.
Also Read: ఆ వైరస్ కు వ్యాక్సిన్ సక్సెస్.. చికిత్సకు అనుమతులు ఇచ్చిన అమెరికా
ఆర్నాబ్ పిటిషన్ ను జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈమేరకు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్ దారుడు బాంబే హైకోర్టును న్యాయం కోసం ఆశ్రయించాలని సూచించింది. అంతేకాకుండా బాంబే హైకోర్టుపై విశ్వాసం ఉంచాలని జస్టిస్ చంద్రచూడ్ హితవు పలికారు.
రిపబ్లిక్ ఛానల్లో దగ్గరలోనే ప్లోరా పౌంటేన్ ప్రాంతంలో బాంబే హైక్టోర్టు ఉందని ఆర్నాబ్ కు కోర్టు గుర్తుచేసింది. పక్కనే ఉన్న హైకోర్టును ఆశ్రయించకుండా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై పిటిషన్ దారుడిని ధర్మాసనం తప్పుబట్టింది. దీంతో ఆర్నబ్ షాక్‌కు గురయ్యాడు. ఈ పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. దీంతో ఆర్నబ్ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
సెలబ్రెటీలను తన ఛానళ్లకు పిలిచి కనీస గౌరవం లేకుండా అంతెత్తున రంకేలేసే ఆర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు షాకివ్వడం చర్చనీయాంశంగా మారింది. చట్టాలన్నీ తనకే తెలుసుని వీర్రవీగే ఆర్నాబ్ కు సుప్రీంకోర్టు భలే షాకిచ్చిందని ఆయన వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: దేశంలో ఆపద వచ్చింది.. ఆదుకునేవారే లేరా? : ఉండవల్లి హాట్ కామెంట్స్
ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్నాబ్ బాంబే హైకోర్టును ఆశ్రయించనున్నాడు. ఈ నేపథ్యంలో టీఆర్పీ స్కామ్ ఆర్నాబ్ మెడకు చుట్టుకోనుందా? అనే చర్చ జోరుగా నడుస్తోంది.