https://oktelugu.com/

Megastar Comments On Radhe Shyam: ‘రాధేశ్యామ్’ పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్

Megastar Comments On Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్ కి సరైన కథ దొరికితే ఎలా ఉంటుందో మరోసారి సాటి చెప్పింది ‘రాధేశ్యామ్’ చిత్రం. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతీయ సినీ లోకాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్‌ కు పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ను అందించిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల అద్భుతమైన టాక్‌ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ చిత్రానికి ఏ సినిమా పోటీ లేకపోవడం, […]

Written By:
  • Shiva
  • , Updated On : March 10, 2022 / 10:02 PM IST
    Follow us on

    Megastar Comments On Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్ కి సరైన కథ దొరికితే ఎలా ఉంటుందో మరోసారి సాటి చెప్పింది ‘రాధేశ్యామ్’ చిత్రం. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతీయ సినీ లోకాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్‌ కు పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ను అందించిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల అద్భుతమైన టాక్‌ సొంతం చేసుకొని దూసుకుపోతోంది.

    Megastar Chiranjeevi

    ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ చిత్రానికి ఏ సినిమా పోటీ లేకపోవడం, ఎలాగూ వారాంతం రావడంతో సినిమా కలెక్షన్లు భారీగా ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో బుకింక్స్ ఏ సినిమాకు రాలేదు అని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా షాక్ అవుతున్నారు.

    Also Read: ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చిన ‘ఓ అల్లు అర్జును’

    మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని ప్రభాస్ నిరూపించారు. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. ప్రభాస్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున సినిమా పై తమ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ‘రాధేశ్యామ్’ చిత్రానికి ఫిదా అయిపోయారు.

    Prabhas Radhe Shyam Movie

    తాజాగా ఈ చిత్రంపై మెగాస్టార్ తన స్పందనను తెలియచేస్తూ.. ‘రాధేశ్యామ్’ సినిమాలో ప్రభాస్ అద్భుతంగా నటించాడు. అసలు, ప్రభాస్ తెరపై ఇలా ఎలా కనిపించాడో అని ఆలోచిస్తున్నా. ఇక ఈ సినిమా క్లైమాక్స్ ను అయితే నేనే కాదు, ఎవరూ ఊహించలేరు. అంత అద్భుతంగా ప్రభాస్ ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకువచ్చాడు. ఇక ప్రభాస్ లుక్, వేషధారణ కూడా చాలా బాగున్నాయి’ అని చిరు అన్నారు.

    Also Read: ప్రభాస్ ఒక్కఫైట్​ కూడా లేకుండా చేసిన సినిమా ఇదే

    Tags