Site icon OkTelugu

Rajamouli Review On Radhe Shyam: ‘రాదేశ్యామ్’ పై రాజమౌళి రివ్యూ ఇదే

Rajamouli Review On Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుచోట్ల ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసింది రాధేశ్యామ్. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ సాధించడంపై అభిమానులు, ప్రముఖులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ… చిత్ర యూనిట్ కు విషెస్ తెలియజేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

Prabhas and Rajamouli

ఈ క్రమంలో రాజమౌళి కూడా తన స్నేహితుడు ప్రభాస్ ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ థియేటర్లలో దుమ్మురేపుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ‘రాధేశ్యామ్’ రచ్చ లేపుతోంది. ప్రభాస్ స్టార్ డమ్ కి ఇది ఒక నిదర్శనం లాంటిది.

Also Read:  రాధేశ్యామ్ థియేటర్లో పూజా హెగ్డే చేసిన ఈ చిలిపి పని.. వైరల్ వీడియో

రాజమౌళి ‘రాధేశ్యామ్’ గురించి ఇంకా మాట్లాడుతూ.. ‘అసలు ఈ సినిమా ఇంత గొప్ప విజయాన్ని అందుకుంటుంది అని నేను ముందే ఊహించాను. అయినా ఫ్యాన్స్ కి కావలసింది ఇది కదా. ప్రభాస్ విధ్వంసం సృష్టించాడు. దర్శకుడు రాధాకృష్ణ ఇరగొట్టాడు.. మ్యూజిక్‌ లో ఫైర్‌ ఉంది’ అంటూ రాజమౌళి ఈ సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

Radhe Shyam

ఏది ఏమైనా ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ ను సొంతం చేసుకుంది. తెలంగాణలో ఆల్ టైమ్ రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. అదే విధంగా వరల్డ్ వైడ్ గా ప్రభాస్ తన పవరేంటో సినిమా వసూళ్ల ద్వారా ఘనంగా నిరూపించాడు. ఇక పూజా కూడా ఈ సినిమాకు పెద్ద అసెట్ గా నిలిచింది. ఈ సినిమా విజయంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా పండుగ చేసుకుంటున్నారు. మరి ముందుముందు ‘రాధేశ్యామ్’ ఇక ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

Also Read:  భీమ్లా నాయక్’ పాటల జ్యూక్‌ బాక్స్‌ రిలీజ్

Exit mobile version