Site icon OkTelugu

Mahesh Reaction on Radhe Shyam: ‘రాధేశ్యామ్’ సక్సెస్‌ పై మహేష్ స్పందన

Mahesh Reaction on Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద ‘రాధేశ్యామ్’ ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. ప్రభాస్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని ప్రభాస్ నిరూపించారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున సినిమా పై తమ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు.

Mahesh Reaction on Radhe Shyam

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో ‘రాధేశ్యామ్’ సినిమాను వీక్షించారు. అనంతరం తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేస్తూ.. ‘రాధేశ్యామ్’ తిరుగులేని విజయం అందుకున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు. నిజంగా ఇది ప్రభాస్ స్టార్ డమ్ కి కొలమానమే. అందరూ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు ఫైనల్ గా బాక్సాఫీస్ సౌండ్ అదిరిపోయింది’ అంటూ మహేష్ చెప్పుకొచ్చాడు.

Also Read:  భీమ్లా నాయక్’ పాటల జ్యూక్‌ బాక్స్‌ రిలీజ్

మహేష్ – ప్రభాస్ మధ్య మంచి స్నేహం ఉంది. అయితే, గతంలో ఎన్నడూ ఇలా మహేష్.. ప్రభాస్ సినిమా గురించి పొగడలేదు. కానీ, మొదటసారి మహేష్ బాబు ఇలా ఓపెన్ అయ్యిపోవడం మహేష్ ఫ్యాన్స్ ను కూడా షాక్ కి గురి చేసింది. మహేష్ ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుతూ.. ప్రభాస్ తో పాటు పూజా కూడా హార్ట్ టచింగ్ ఫెర్మామెన్స్ ఇచ్చిందని మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Radhe Shyam

ఇక ‘రాధేశ్యామ్’ సినిమాకి జస్టిన్‌ ప్రభాకరన్‌ అందించిన మ్యూజిక్ కూడా టాప్ లో ఉందని.. దర్శకుడు రాధాకృష్ణ మిగతా టీమ్ అద్భుతంగా పని చేశారు అని.. ముఖ్యంగా జగపతిబాబు గారు కూడా అద్భుతంగా నటించారని మహేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మహేష్ కామెంట్స్ పై ప్రేక్షకులు మీకులాగే చాలా ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read: ఆర్​ఆర్​ఆర్​’ అలా చూస్తే కిక్కు ఏముంటుంది.. ఇలా చూడండి

Exit mobile version