Chiranjeevi New Movie Title: మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక కమర్షియల్ పంథా లో ఈ మూవీ సాగబోతున్న తెలుస్తోంది. ఇక అనిల్ ఈ సినిమాని చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ తో తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి దానికి తగ్గట్టుగానే ఈరోజు చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టర్ ఈ మూవీ లో ఎలా ఉండబోతోంది అనేది మనకు చూపించారు. ఈ సినిమాలో మనం వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నాం అనేది చెప్పకనే చెబుతున్నారు. అలాగే చిరంజీవి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. మరి దానికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ ను మార్చుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఈ సినిమాలో సైతం కామెడీని పుష్కలంగా పండించబోతున్నట్టుగా ఈ ఒక్క గ్లింప్స్ క్లారిటీ అయితే ఇచ్చారు…ఇక వెంకటేష్ వాయిస్ తో ‘శంకర్ వర ప్రసాద్ పండక్కి వస్తున్నారు’ అంటూ టైటిల్ ని అనౌన్స్ చేసిన విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.
Also Read: చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలకు పవన్ కళ్యాణ్ దూరం..?
ముఖ్యంగా మెగా అభిమానులను సెంటిమెంటల్ గా కూడా కనెక్ట్ చేస్తూ ఈ సినిమా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే చిరంజీవి మొదటి పేరు శివ శంకర వరప్రసాద్ కావడంతో అదే పేరు ని సినిమాకి టైటిల్ గా వాడుకుంటూ అనిల్ రావిపూడి మెగా అభిమానులను ఎమోషనల్ కి గురి చేస్తున్నాడు…
ఇక మన శంకర్ వరప్రసాద్ పండక్కి వస్తున్నారు అంటూ వెంకటేష్ డైలాగుతో టైటిల్ ని రివిల్ చేయడం అనేది నిజంగా ద్భుతంగా ఉందని మెగా అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవడమే కాకుండా మరోసారి భారీ సక్సెస్ ని సాధిస్తోంది అంటూ మెగా అభిమానులు సైతం చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తూ ఉండడం విశేషం… ఇక పండక్కి సూపర్ సక్సెస్ ని సాధించడం అనిల్ రావిపూడి కి అలవాటైపోయింది.
Also Read: చిరిగిన చొక్కా వేసుకొని పెళ్లి చేసుకున్న చిరంజీవి…కారణం ఏంటంటే..?
కాబట్టి ఈ సంక్రాంతికి వెంకటేష్ తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఎంతటి సక్సెస్ ని సాధించిందో 2026 సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా సైతం భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు. తద్వారా చిరంజీవికి ఎలాంటి సక్సెస్ ని కట్టబెడతాడు అనేది తెలియాల్సి ఉంది…