Mega Star Legacy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను చేయగలిగిన కెపాసిటి ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి…ఒక సామాన్యుడు తలుచుకుంటే ఎంతటి గొప్ప కార్యాన్ని అయినా సరే సాధించవచ్చు అని ప్రూవ్ చేసిన ఒకే ఒక్క నటుడు మెగాస్టార్ చిరంజీవి…తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుండా వచ్చి తన మార్కును చూపిస్తూ చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అనేలా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద తన ముద్ర వేశాడు నటుడు కూడా తనే కావడం విశేషం. ఇక ఈరోజు చిరంజీవి బర్త్ డే కావడం ఆయన 70 సంవత్సరాల వయసులోకి అడుగుపెట్టడం నిజంగా చాలా గొప్ప విషయం…మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాలను సైతం పూర్తి డెడికేషన్ తో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. తన సక్సెస్ కి కారణం ఆయన డెడికేషనే అంటూ చాలామంది చెబుతూ ఉంటారు. ఏ టైం కి ఏం చేయాలో తెలుసుకొని వాటిని పోస్టుపోన్ చేస్తూ సినిమా మీద ఉన్న తన ప్యాషన్ ను ఏ మాత్రం వదులుకోకుండా అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ వచ్చాడు. కాబట్టే చిరంజీవి మెగాస్టార్ స్థాయికి వెళ్ళాడు అంటూ మరి కొంతమంది అతని గురించి చాలా గొప్పగా చెబుతూ ఉండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవిని టచ్ చేయడం ఎవరి వల్ల కాదు అనేది ఎప్పటికప్పుడు తను ప్రూవ్ చేస్తూ వస్తున్నాడు.
Also Read: చిరిగిన చొక్కా వేసుకొని పెళ్లి చేసుకున్న చిరంజీవి…కారణం ఏంటంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని సైతం తట్టుకొని అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం తన మార్కును చూపించగలిగిన ఏకైక నటుడు చిరంజీవి…ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలచందర్ సైతం ఒక రజనీకాంత్ ఒక కమల్ హాసన్ ఇద్దరు కలిస్తే మెగాస్టార్ చిరంజీవి అంటూ ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.
అలాగే ఫోబ్స్ మ్యాగజైన్ వాళ్ళు చిరంజీవి ప్రస్తావనను తీసుకొచ్చి ‘బిగ్గర్ దెన్ బచ్చన్’ అంటూ ఒక మ్యాగజైన్ ను రిలీజ్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే చిరంజీవి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అతని డ్యాన్సులు చూసి రజనీకాంత్ భయపడ్డాడట.
Also Read: బర్త్ డే స్పెషల్.. పవన్ కు సర్ప్రైజ్ చేసిన చిరు!
నేను అలా డ్యాన్స్ చేయలేను కాబట్టి చిరంజీవి ముందు నేను డాన్స్ లో తేలిపోతాను అంటూ తన సన్నిహితుల దగ్గర చాలాసార్లు చెప్పుకున్నట్టుగా రజనీకాంత్ ఓపెన్ గా కొన్ని సందర్భాల్లో చెప్పాడు. ఇక కమల్ హాసన్ అయితే చిరంజీవి లాంటి మాస్ కమర్షియల్ సినిమాలను నేను చేయలేను అని ఓపెన్ గా చెప్పేశాడు. ఒకరకంగా ఒకేసారి రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరికీ భయాన్ని పుట్టించిన ఏకైక హీరో కూడా మన చిరంజీవి గారే కావడం విశేషం…