Chiranjeevi Birthday Pawan Kalyan: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సినీ ప్రస్థానం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కృషి, పట్టుదల ఉంటే ఒక సామాన్యుడు అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పడానికి ఆయన ఒక నిదర్శనం. చిన్న పిల్లలకు పాఠ్య పుస్తకాల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం ని చేర్చవచ్చు, అలాంటి స్ఫూర్తి దాయకమైన మనిషి ఆయన. చూస్తూ ఉండగానే రేపటితో ఆయనకు 70 ఏళ్ళ వయస్సు వచ్చేస్తుంది. ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా చిరంజీవి తన కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకోబోతున్నాడు. అయితే ప్రతీ ఏడాది ఆయన పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లోని తన సొంత ఇంట్లోనే జరిగేది. కానీ ఈసారి మాత్రం గోవా లో జరుపుకోబోతున్నాడు. ఈ పుట్టినరోజు వేడుకలకు మెగా హీరోలందరూ హాజరు కాబోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), అల్లు అర్జున్(Icon star Allu Arjun) పాల్గొంటారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
Also Read: ఇంతకీ ‘విశ్వంభర’ లో విలన్ అతనేనా..? ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్!
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి పాల్గొనడం అసాధ్యమట. ఎందుకంటే ప్రస్తుతం ఆయన మంగళగిరి లోని తన క్యాంపు ఆఫీస్ లో ఉన్నాడు. తన శాఖలకు సంబంధించి రేపు కీలకమైన రివ్యూ మీటింగ్స్ ని జరిపించబోతున్నాడట. అందుకే చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు పవన్ కళ్యాణ్ ఈసారి పాల్గొనడం కష్టమే అని తెలుస్తుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ బిజీ గా ఉన్నా లేకపోయినా ఇలాంటి ఈవెంట్స్ కి రావడానికి పెద్దగా ఇష్టం చూపించడు. కానీ రెండేళ్ల క్రితం చిరంజీవి ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలకు మాత్రం ఆయన హాజరయ్యాడు, మంచి సందడి కూడా చేసాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఉప ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి తో కలిసి సంబరాలు చేసుకుంటే చూడాలని ఉందని అభిమానుల చిరకాల కోరిక. కానీ అది ఈసారికి నెరవేరడం కష్టమే, వేరే ఏదైనా సందర్భం లో అభిమానుల కోరిక నెరవేరొచ్చు.
ఇదంతా పక్కన పెడితే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేడు కాసేపటి క్రితమే విశ్వంభర గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు. దీనికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రేపు చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబందించిన గ్లింప్స్ వీడియో కూడా విడుదల కానుంది. ఈ గ్లింప్స్ వీడియో కి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ అందించాడట. ఆయన కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇవి రెండు మాత్రమే కాకుండా, చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన ముహూర్తం కూడా రేపే జరగనుంది అట. అంతే కాకుండా ఆయన కెరీర్ లో ఎంతో స్పెషల్ గా నిల్చిన ‘స్టాలిన్’ చిత్రం కూడా రేపు రీ రిలీజ్ అవ్వబోతుంది. మెగా ఫ్యాన్స్ కి రేపు పెద్ద పండగే అనొచ్చు.