Chiranjeevi- Adipurush: ‘ఆదిపురుష్’ స్పెషల్ ప్రీమియర్ షో కి విచ్చేయనున్న మెగాస్టార్ చిరంజీవి

రీసెంట్ గా జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ చిరంజీవి ఈ సినిమా గురించి గతం లో చేసిన కామెంట్స్ గురించి చెప్పుకొచ్చాడు. రామాయణం చెయ్యడం ప్రతీ నటుడికి అదృష్టం లాంటిది, ఆ అదృష్టం ఇప్పుడు నీకు వరించింది, ఆల్ ది బెస్ట్ బాగా చెయ్యండి అని తన శుభాకాంక్షలు తెలియచేసాడట. మరి ఇప్పుడు ఆయన ఈ సినిమా చూసిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడో చూడాలి.

Written By: Vicky, Updated On : June 8, 2023 5:07 pm

Chiranjeevi- Adipurush

Follow us on

Chiranjeevi- Adipurush: ఇండియా మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసిన ‘ఆదిపురుష్’ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు,ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ శ్రీ రాముడి గెటప్ వెయ్యడం, దాని భారీ బడ్జెట్ తో మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో తెరకెక్కించడం తో పాటుగా, రీసెంట్ గా ఈ సినిమా నుండి విడుదలైన పాటలు మరియు ట్రైలర్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోవడం తో చిత్రం పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

ఇక రీసెంట్ గా తిరుపతి లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ చిత్రం పై హైప్ పెంచేలా చేసింది. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు, అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించడమే ఆలస్యం, కనీవినీ ఎరుగని రేంజ్ గ్రాస్ ఓపెనింగ్ ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నారు. ఇక పోతే కాసేపటి క్రితమే ఈ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి క్లీన్ U సర్టిఫికేట్ ఇచ్చారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ ప్రీమియర్ షో ని సెలెబ్రిటీల కోసం వెయ్యబోతున్నారు. హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో ఈ స్పెషల్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షో కి టాలీవుడ్ కి చెందిన ప్రేముకులందరికీ ఆహ్వానం దక్కినట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ షోకి విచ్చేయబోతున్నారట. ఆయనతో పాటుగా రామ్ చరణ్, అల్లు అర్జున్ , ఎన్టీఆర్ తదితరులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చారట. వీళ్లంతా వస్తారో లేదో తెలియదు కానీ, మెగాస్టార్ చిరంజీవి మాత్రం కచ్చితంగా హాజరు అవుతాడని తెలుస్తుంది.