Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ తెలుగుమ్మాయి కావడం కారణమో, లేక.. గ్లామర్ బ్యూటీ కాకపోవడం కారణమో తెలియదు గానీ, ఆమెకు తెలుగులో మెయిన్ హీరోయిన్ గా సరైన అవకాశాలు రాలేదు. కనీసం సెకెండ్ హీరోయిన్ గానో కూడా ఆమెకు మంచి సినిమాలు రాలేదు. సైడ్ పాత్రలకు, సింపతి పాత్రలకు మాత్రమే ఆమె పరిమితం అయింది. ‘రిపబ్లిక్’ లాంటి సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కనిపించినా.. సక్సెస్ రాలేదు. పైగా ఐశ్వర్య రాజేష్ చేసిన హీరోయిన్ పాత్రలన్నీ చిన్న పాత్రలే.
మొత్తానికి తెలుగులో ఆమెకి ఇప్పటివరకు సరైన బ్రేక్ రాకపోయినా.. తెలుగు దర్శకనిర్మాతలు ఆమెను నిర్లక్ష్యం చేసినా.. తమిళ మేకర్స్ మాత్రం ఆమెను ఆదరిస్తునారు. ఐశ్వర్య రాజేష్ కి పెద్ద హీరోల సరసన కూడా అవకాశాలు వస్తున్నాయి. మెయిన్ హీరోయిన్ గా ఆమె చేతిలో మూడు సినిమాలున్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య నిర్మిస్తున్న కొత్త చిత్రంలో ఐశ్వర్య రాజేష్ మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది.
Also Read: Chiranjeevi – Ramya Krishna: చిరంజీవితో రమ్యకృష్ణ.. ఆమె క్యారెక్టర్ పై క్రేజీ అప్ డేట్
అలాగే వైవిధ్యమిన చిత్రాల దర్శకుడు బాల ప్రస్తుతం తీస్తున్న సినిమాలోనూ ఐశ్వర్య రాజేష్ మెయిన్ హీరోయిన్ ఖరారు అయింది. ఇక ఈ సినిమాలో హీరోగా గెస్ట్ పాత్రలో సూర్య కనిపిస్తారని తెలుస్తోంది. అంటే.. బాల చేస్తోన్న సినిమాలో మెయిన్ లీడ్ ఐశ్వర్య రాజేషే. ఐశ్వర్య రాజేష్ చేతిలో మరో పెద్ద సినిమా కూడా ఉంది.
హీరో ఆర్య సరసన ఆమె ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమైనది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర. ఈ సినిమాల్లో ఏ సినిమా హిట్ అయినా.. ఆమెకు అవకాశాలు ఇంకా ఎక్కువగా వస్తాయి. అందుకే తెలుగులో ఇక చిన్న చిన్న పాత్రలు ఇక చెయ్యను అని ఆమె తేల్చిచెప్పింది. మరి ఐశ్వర్య రాజేష్ ఇకనైనా స్టార్ హీరోయిన్ అవుతుందా ? చూడాలి.
Also Read:Hansika: దేశముదురు భామ ‘హన్సిక’ అంగాంగ ప్రదర్శన.. అందాల విందు వైరల్