Chiranjeevi changed His Name: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..స్వయంకృషి తో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన చిరంజీవి ప్రతి ఒక్కరికి ఆదర్శమే..యూత్ , మాస్ , క్లాస్ అని తేడా లేకుండా ప్రతి సెక్షన్ లో సరిసమానమైన క్రేజ్ ఉన్న హీరో ఈయన ఒక్కడే..పదేళ్ల విరామం తర్వాత ఆయన ఇండస్ట్రీ కి వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కుర్ర హీరోలతో పోటీ పడుతూ వంద కోట్ల రూపాయిల షేర్ ని వరుసగా రెండు సార్లు అవలీలగా దాటాడు..అది మన మెగాస్టార్ రేంజ్..అయితే ఇటీవలే ఆయన హీరో గా నటించిన ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయం పాలైంది..ఇలాంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమా చిరంజీవి 40 ఏళ్ళ కెరీర్ లో లెదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా లూసిఫెర్ అనే సినిమాకి రీమేక్ గా గాడ్ ఫాదర్ అనే సినిమాని చేస్తున్నాడు..తమిళ టాప్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఫస్ట్ లుక్ తో పాటుగా ఒక వీడియో ని కూడా విడుదల చేసారు..దీనికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..మెగాస్టార్ ని తొలిసారిగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చూసేసరికి అభిమానులు కూడా థ్రిల్ కి గురైయ్యారు..ఇది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియా లో చిరంజీవి పేరు కి సంబంధించిన ఒక వార్త పెద్ద చర్చనీయాంశంగా మారింది..అదేమిటి అంటే చిరంజీవి గారు న్యూమరాలజీ ని గట్టిగ నమ్ముతారు అట..ఆయన న్యూమరాలజీ ప్రకారం స్క్రీన్ నేమ్ ని ‘chiranjeevi’ కి బదులుగా ‘chiranjeeevi’ అని మార్చుకోమని సలహా ఇచ్చారట జ్యోతిష్యులు..అందుకే మొన్న విడుదలైన గాడ్ ఫాదర్ వీడియో లో కూడా ‘chiranjeeevi’ అని టైటిల్ పడుతుంది..మరి చిరు పేరు లో జరిగిన ఈ చిన్న మార్పు వల్ల ఈ సినిమా ఫలితం పాజిటివ్ గా వస్తుందో లేదో చూడాలి.

Also Read: Nayantara House: నయనతార కొన్న ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?
అంతే కాకుండా తమిళ దర్శకుడు మోహన్ రాజా కి మంచి డైరెక్టర్ గా పేరుంది..టాలీవుడ్ లో సూపర్ హిట్టైన ధ్రువ సినిమా ఆయన తమిళం లో తీసిన ‘తని ఒరువన్’ అనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి రీమేక్..ఈ సినిమా సరైన హిట్టు లేకుండా ఇబ్బంది పడుతున్న తమిళ హీరో జయం రవి కి..అలాగే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మంచి హిట్ సినిమాగా నిలిచి వాళ్ళని మళ్ళీ ట్రాక్ లో పడేలా చేసింది..ఇప్పుడు ఆచార్య డిజాస్టర్ ఫ్లాప్ తో డీలాపడిన మెగా అభిమానులకు కచ్చితంగా హిట్ ఇస్తాడని నమ్మకం తో ఉన్నాయి ట్రేడ్ వర్గాలు..ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ విజయదశమి నాడు ప్రేక్షకుల ముందుకి రానుంది..మరి ఈ సినిమా తో చిరంజీవి మెగా అభిమానుల ఆకలి తీరుస్తాడా లేదా అనేది చూడాలి.
Also Read: Revanth Reddy: కాంగ్రెస్ లో చేరే వారికి టికెట్ల హామీ ఇవ్వడం లేదట.. రేవంత్ సంచలనం
[…] […]
[…] […]