
Renu Desai : నటి రేణు దేశాయ్ లేటెస్ట్ పోస్ట్ సంచలనంగా మారింది. ఆమె ఓ మెగా అభిమాని మీద ఫైర్ అయ్యారు. సహనం కోల్పోయి దారుణమైన కామెంట్ చేశారు. పైగా తన రిప్లై ని రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టారు. ఇది వైరల్ అవుతుంది. చాలా మంది నెటిజన్స్ అతను తప్పేమన్నాడని అంత కోప్పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ 8 అకీరా నందన్ బర్త్ డే. మెగా అభిమానులతో పాటు నాగబాబు, సాయి ధరమ్ తేజ్ అలాగే కొందరు కుటుంబ సభ్యులు అకీరాకు బర్త్ డే విషెస్ చెప్పారు. అకీరా బర్త్ డే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు రేణు దేశాయ్ ని రిక్వెస్ట్ చేశారు.
”మేడం ఇది చాలా అన్యాయం. మా అకీరాని ఒకసారైనా చూపించండి. మా అన్న కొడుకుని చూడాలని ఉంటుంది మాకు. మీరు దాచి పెట్టకండి. అప్పుడప్పుడు వీడియోస్ లో అకీరా బాబును చూపించండి” అని రేణు దేశాయ్ ని ఉద్దేశిస్తూ కామెంట్ పెట్టాడు. ఆ సందేశం చదివిన రేణు దేశాయ్ కి చిర్రెత్తుకొచ్చింది. ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. ”మీ అన్న కొడుకు??? అకీరా నా అబ్బాయి. మీరు ఒక తల్లికి పుట్టలేదా? మీరు హార్డ్ కోర్ ఫ్యాన్ అని అర్థం అవుతుంది. కానీ కొంచెం మాట్లాడే పద్ధతి నేర్చుకోండి. ఇలాంటి సందేశాలు నేను తరచుగా పట్టించుకోకుండా వదిలేస్తున్నాను. మీకు ఇతరుల ఫీలింగ్స్, నమ్మకాలతో పని లేదు” అని పరుష పదజాలంతో రేణు దేశాయ్ విరుచుకుపడ్డారు.

సదర్ నెటిజెన్ మా అన్న కొడుకు అనడాన్ని ఆమె తప్పుబట్టారు. మీ అన్న కొడుకు ఎలా అవుతాడు. అకీరా నా కొడుకు అని నొక్కి వక్కాణించే ప్రయత్నం చేసింది. గతంలో కూడా రేణు దేశాయ్ ఈ విషయంలో ఆగ్రహానికి గురయ్యారు. అకీరా కేవలం పవన్ కళ్యాణ్ కొడుకుగా మాట్లాడితే ఆమె సహించరు. వెంటనే రియాక్ట్ అవుతారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరాను విపరీతంగా అభిమానిస్తారు. పవన్ కళ్యాణ్ నటవారసుడిగా పరిగణిస్తారు.

ఇదిలా ఉంటే రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. దశాబ్దాల తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ మీద కనిపించనున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ కీలక రోల్ చేస్తున్నారు. దసరా కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. నటిగా బిజీ కావాలని చూస్తున్న రేణు దేశాయ్ మకాం పూణే నుండి హైదరాబాద్ కి మార్చారు.