అంతులేని సంతోషం.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్ !

మెగాస్టార్ చిరంజీవికి ఆయన ఫ్యాన్స్ కి మధ్య విడతియలేని బంధం ఉంది. అందుకే మెగా ఫ్యాన్స్ అనే పదం వినగానే తనకు ఓ వైబ్రేషన్ వస్తోంది అంటుంటారు మెగాస్టార్. అయితే తాజాగా మెగాస్టార్ కి ఓ అభిమాని ఇచ్చిన బహుమతికి మెగాస్టార్ ఫిదా అయిపోయారు. నేడు వరల్డ్ టూరిజం డే సందర్భంగా.. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో మెగాస్టార్ చేసిన పనులను అలాగే అప్పటి సంగతులను గుర్తు చేసుకుంటూ ఓ అభిమాని వీడియో రూపంలో ఎడిట్ […]

Written By: admin, Updated On : September 27, 2020 4:47 pm
Follow us on


మెగాస్టార్ చిరంజీవికి ఆయన ఫ్యాన్స్ కి మధ్య విడతియలేని బంధం ఉంది. అందుకే మెగా ఫ్యాన్స్ అనే పదం వినగానే తనకు ఓ వైబ్రేషన్ వస్తోంది అంటుంటారు మెగాస్టార్. అయితే తాజాగా మెగాస్టార్ కి ఓ అభిమాని ఇచ్చిన బహుమతికి మెగాస్టార్ ఫిదా అయిపోయారు. నేడు వరల్డ్ టూరిజం డే సందర్భంగా.. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో మెగాస్టార్ చేసిన పనులను అలాగే అప్పటి సంగతులను గుర్తు చేసుకుంటూ ఓ అభిమాని వీడియో రూపంలో ఎడిట్ చేసి చిరు పై తనకున్న ప్రేమను చాటాడు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తిరిగి తిరిగి చివరకు చిరు దగ్గరకు చేరింది.

Also Read: ఆ హీరో నిజంగా బంగారమే.. అభిమాని చెప్పును తాకిన స్టార్ హీరో

వీడియోలో తానూ పర్యాటక మంత్రిగా ఉన్న సమయంలో.. తానూ చేసిన అప్పటి అభివృద్దిని, అలాగే భారతదేశానికి, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబందించి తను చేసిన పర్యాటక కార్యక్రమాలను, పర్యాటక రంగాన్ని డెవలప్ చేయడానికి తానూ తెచ్చిన పెట్టుబడులను ఇలా అప్పటి విషయాలకు సంబంధించిన పేపర్స్ కట్టింగ్స్ అన్నింటిని లైన్ ఆర్డర్ లో పెట్టి ఎడిట్ చేసిన విధానానికి మొత్తానికి మెగాస్టార్ ముగ్దుడయ్యారు. ముఖ్యంగా మెగాస్టార్ పర్యాటక మంత్రిగా మన దేశ ఖ్యాతి, పర్యాటక ప్రదేశాల గురించి చిరు విదేశాల్లో చెప్పిన సంగతులను కూడా ఆ అభిమాని వీడియోలో చక్కగా పొందుపరిచడం మెగాస్టార్ ను బాగా ఆకట్టుకుంది.

Also Read: ప్రభాసా.. మజాకా..! : సౌత్‌ ఇండియాలోనే టాప్‌

అందుకే ఆ అభిమాని అంత కష్టపడి చేసిన ఈ వీడియో గురించి మెగాస్టార్ ఎమోషనల్ అవుతూ.. ‘ఇది నా అభిమాని చేశాడని తెలుసుకుని.. నేను ఎంతో గౌరవంగా ఫీలవుతున్నాను. మన అద్భుతమైన దేశానికి చేసిన సేవ, నాకు సంతృప్తిని ఇచ్చిన ఎన్నో విషయాలను ఈ వీడియోతో నాకు తిరిగి గుర్తు చేశారు నా అభిమాని. కొద్ది నిముషాల పాటే వీడియో ఉన్నా.. నాకు ఈ వీడియో అంతులేని సంతోషాన్ని ఇచ్చింది. ఇక పర్యాటక మంత్రిగా నాకు అనంతమైన ప్రశంసలు వచ్చాయి. మన దేశ ఖ్యాతిని నలుమూలలా పంచే అదృష్టం వచ్చింది. నా వంతుగా నేను కష్టపడ్డాను.. మంచి చేశాను.. కాలంతో పాటు నిలిచిపోయే జ్ఞాపకాలెన్నో ఉన్నాయి’ అని మెగాస్టార్ ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు.

https://twitter.com/KChiruTweets/status/1310123005394083842