Homeబిజినెస్BSNL Offers: ఒక రూపాయికి ఒక జీజీ డేటా.. బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. ఈ ఒక్కరోజు...

BSNL Offers: ఒక రూపాయికి ఒక జీజీ డేటా.. బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. ఈ ఒక్కరోజు మాత్రమే

BSNL Offers: బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే ఆఫర్ తీసుకొచ్చింది. ఇప్పుడు రూ.400కే ఏకంగా 400GB డేటా అందిస్తోంది. అంటే ఒక జీబీ డేటా ఒక రూపాయి మాత్రమే అన్న మాట. మార్కెట్లో పోటీ తట్టుకోలేక కష్టాలు పడుతున్న బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఒక కొత్త ప్లాన్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే ఫ్లాష్ సేల్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కేవలం రూ.400 రూపాయలకే ఏకంగా 400GB డేటా అందిస్తోంది. అంటే, ఒక GB డేటాకు కేవలం ఒక రూపాయి మాత్రమే పడుతుంది. ఈ ఆఫర్ జూన్ 28న మొదలైంది. కానీ ఈరోజు జూలై 1, 2025 తో ముగుస్తుంది.

Also Read: చిరంజీవి సపోర్ట్ వల్లే ఆ నటుడు స్టార్ హీరోగా ఎదిగాడా..?

ఈ ఆఫర్‌ను పొందాలంటే BSNL వెబ్‌సైట్ లేదా BSNL సర్వీస్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ డేటా ప్లాన్‌కు వాయిస్ కాల్స్ లేదా SMS ప్రయోజనాలు ఉండవు. ఇది కేవలం డేటా కోసం మాత్రమే. అంటే, మీ దగ్గర ఇప్పటికే ఒక యాక్టివ్ ప్లాన్ ఉంటే దానికి ఈ డేటా ప్యాక్‌ను అదనంగా యాడ్ చేసుకోవచ్చు.

వాస్తవానికి ఈ ఫ్లాష్ సేల్ వెనుక ఒక పెద్ద కారణం ఉంది. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం.. మే నెలలో BSNL ఏకంగా 1.35 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్ తో పోటీ పడలేక BSNL కష్టాలు పడుతోంది. అందుకే, ఈ తరహా ఆఫర్లతో మళ్ళీ కస్టమర్లను తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది. ఈ ఆఫర్ ద్వారా కొత్తగా కనెక్ట్ అయ్యే కస్టమర్ల సంఖ్యను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

BSNL తన నెట్‌వర్క్ కవరేజీని మెరుగుపరచడానికి కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 90,000 4G టవర్లను ఇన్‌స్టాల్ చేసిన BSNL, 2025 మధ్య నాటికి మొత్తం ఒక లక్ష 4G టవర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల కస్టమర్లకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది.

అంతేకాదు, కస్టమర్లకు మంచి అనుభవాన్ని అందించడానికి, BSNL కొత్త టవర్ల ఏర్పాటు కోసం రూ.13,000 కోట్లకు పైగా ఖర్చు చేయబోతోంది. హైదరాబాద్‌లో అయితే ఇప్పటికే 5G Fixed Wireless Access సేవలను ప్రారంభించింది. త్వరలో బెంగళూరుతో పాటు దక్షిణాదిలోని మరికొన్ని నగరాలకు ఈ సేవలను విస్తరించాలని చూస్తోంది. దీనివల్ల ఫైబర్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా 5G వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. మొత్తానికి, BSNL నెట్‌వర్క్ విషయంలో తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ కొత్త ఆఫర్లు, కొత్త టవర్ల ఏర్పాటుతో BSNL మళ్ళీ పుంజుకుంటుందేమో చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version