Poison Experiment On Star Comedian: మన టాలీవుడ్ లో కుడుపుబ్బా నవ్వించే కమెడియన్స్ లో ఒకరు బాబు మోహన్..యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరో గా నటించిన ఆహుతి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా బాబు మోహన్..ఆ తర్వాత ‘మామ గారు’ అనే సినిమా ద్వారా అద్భుతమైన హాస్యాన్ని పండించి నంది అవార్డుని కూడా అందుకున్నారు..ఇక ఈ సినిమా తర్వాత బాబు మోహన్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..వరుసగా సినిమాలు మీద సినిమా చేసుకుంటూ తన అద్భుతమైన హాస్యం తో స్టార్ కమెడియన్ గ ఒక వెలుగు వెలిగాడు..ఇక అన్నగారు స్వతీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినా తర్వాత తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేంట్రం చేసి రెండు సార్లు MLA గా గెలుపొంది ఒకసారి మినిస్టర్ బాధ్యతలు కూడా చేపట్టాడు..ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత TRS పార్టీ లో చేరి MLA గా పోటీ చేసి గెలుపొందాడు..ప్రస్తుతం ఆయన BJP పార్టీ లో కొనసాగుతున్నాడు..సినిమాల పరంగా మరియు రాజకీయ పరంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన బాబు మోహన్ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని విషయాలను పంచుకున్నాడు..వాటిల్లో ఆయన పై విష ప్రయోగం జరిగింది అంటూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Also Read: World Population Day 2022: ప్రపంచ జనాభా దినోత్సవం స్పెషల్ స్టోరీ
రాజకీయాలు అంటేనే రొచ్చు అనే విషయం మన అందరికి తెలుసు..కుళ్ళు కుతంత్రాలకు పుట్టినిల్లు లాంటిది రాజకీయాలు..అయితే బాబు మోహన్ తన రాజకీయ జీవితం లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పిన మాటలు వింటే ఇంత నీచమా అని అనిపిస్తుంది..ఇక అసలు విషయానికి వస్తే బాబు మోహన్ కి పాన్ ఏసుకోవడం అలవాటు..సమయం దొరికినప్పుడల్లా ఆయన పాన్ వేసుకుంటాడు అట..ఇక ఆయన మెదక్ నుండి హైదరాబాద్ వచ్చేటప్పుడు సంగారెడ్డి దగ్గర ఒక చోట పాన్ వేసుకునే అలవాటు ఉంది అట..అలా ఒకరోజు పాన్ తీసుకొని వెళ్తుండగా అందులో విషం కలిపినట్టు తెలిసింది..ఈ విషయం ఆ పాన్ షో ఓనర్ భార్య బాబు మోహన్ కి ఫోన్ చేసి చెప్పిందట..ప్రత్యర్థి పార్టీ కి సంబంధించిన వాళ్ళు కావాలని ఈ పని చేసినట్టు చెప్పుకొచ్చాడు బాబు మోహన్..ఇదంతా చూసిన తర్వాత రాజకీయాలు అంటే ఇంత నీచంగా ఉంటాయా అని అనిపించిందంటూ బాబు మోహన్ ఎంతో ఎమోషనల్ గా ఈ విషయాన్నీ పంచుకున్నాడు.

Also Read: CM Jagan: జగన్ ఎమోషనల్, సెంటిమెంట్ అస్త్రాలు… టీడీపీపై ధనిక ముద్ర




[…] Also Read:Poison Experiment On Star Comedian: స్టార్ కమెడియన్ పై విష ప… […]