https://oktelugu.com/

Megastar Chiranjeevi Godfather: దసరా రేస్ నుండి తప్పుకున్న మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’..మెగా ఫాన్స్ కి ఇది మాములు షాక్ కాదు

Megastar Chiranjeevi Godfather: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న చిత్రం గాడ్ ఫాదర్..మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా మోహన్ లాల్ లూసిఫెర్ సినిమాకి రీమేక్..ఇటీవలే విడుదల చేసిన టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..మెగాస్టార్ చిరంజీవి తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం తో ఈ సినిమాని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 8, 2022 / 08:05 AM IST
    Follow us on

    Megastar Chiranjeevi Godfather: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న చిత్రం గాడ్ ఫాదర్..మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా మోహన్ లాల్ లూసిఫెర్ సినిమాకి రీమేక్..ఇటీవలే విడుదల చేసిన టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..మెగాస్టార్ చిరంజీవి తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం తో ఈ సినిమాని హిందీ లో కూడా గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు..ఆచార్య వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత వస్తున్నా చిరంజీవి సినిమా కావడం తో ఈ మూవీ తో ఎలా అయినా పెద్ద హిట్ కొట్టాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు..వాళ్ళ కోరికకు తగ్గట్టు గానే ఈ సినిమా ఔట్పుట్ కూడా బాగా వచ్చిందట..అక్టోబర్ 5 వ తేదీన ప్రపంచావ్యాప్తంగా తెలుగు మరియు హిందీ బాషలలో ఘనంగా విడుదల చెయ్యబోతున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసేసారు.

    Megastar Chiranjeevi

    అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఫిలిం నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దసరా రేస్ నుండి తప్పుకొని డిసెంబర్ కి వాయిదా పడుతున్నట్టు తెలుస్తుంది..పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా బాలన్స్ ఉండడం..ఆ వర్క్ మొత్తం అక్టోబర్ 5 తోపుకి పూర్తి అయ్యే అవకాశం కనిపించకపోవడం వల్ల వాయిదా వెయ్యక తప్పని పరిస్థితి వచ్చిందంటున్నారు..ప్రస్తుతానికి ఇది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న రూమర్ మాత్రమే..సినిమా వాయిదా పడినట్టు టీం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

    Megastar Chiranjeevi

    అక్టోబర్ 5 తేదీ నాడు ఈ సినిమా విడుదలైతే మెగా ఫాన్స్ కి పండగే అని చెప్పుకోవచ్చు..ఎందుకంటే అక్టోబర్ 2 వ తేదీ నుండి అక్టోబర్ 9 వ తేదీ వరుకు వరుసగా సెలవలు వచ్చాయి..ఈ సెలవు దినాలకు తగట్టుగా సరైన టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్ విలయ తాండవం ఆడుతాడనే చెప్పాలి..అభిమానులు కూడా అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు..మరి ఈ సినిమా అక్టోబర్ 5 న వస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ వీకెండ్ వరుకు వేచి చూడాల్సిందే.

    Tags