https://oktelugu.com/

Chiranjeevi- Nani: ‘డాడీ’ గా మెగాస్టార్.. ‘బ్రో’ గా నాని.. కలయిక అదిరిపోయింది !

Chiranjeevi- Nani: మెగాస్టార్ చిరంజీవి.. మళ్ళీ సినిమాల్లోకి రాగానే.. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అసలు మెగాస్టార్ ఈ స్థాయిలో భారీ చిత్రాలను చాలా వేగంగా చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ, కాలం ఆయన్ని మళ్ళీ రంగుల ప్రపంచం వైపుకు నెట్టింది. పైగా వేగం రెట్టింపు చేసి వదిలినట్టు ఉంది. మెగాస్టార్ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. జెట్ స్పీడ్ తో ముమ్మరంగా దూసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే లూసిఫర్ రీమేక్‌ గా గాడ్‌ఫాదర్ చేస్తున్న చిరంజీవి మరో […]

Written By:
  • Shiva
  • , Updated On : March 20, 2022 / 03:13 PM IST
    Follow us on

    Chiranjeevi- Nani: మెగాస్టార్ చిరంజీవి.. మళ్ళీ సినిమాల్లోకి రాగానే.. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అసలు మెగాస్టార్ ఈ స్థాయిలో భారీ చిత్రాలను చాలా వేగంగా చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ, కాలం ఆయన్ని మళ్ళీ రంగుల ప్రపంచం వైపుకు నెట్టింది. పైగా వేగం రెట్టింపు చేసి వదిలినట్టు ఉంది. మెగాస్టార్ అస్సలు వెనక్కి తగ్గడం లేదు.

    Chiranjeevi- Nani

    జెట్ స్పీడ్ తో ముమ్మరంగా దూసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే లూసిఫర్ రీమేక్‌ గా గాడ్‌ఫాదర్ చేస్తున్న చిరంజీవి మరో సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. లూసిఫర్‌లో కలిసి నటించిన మోహన్‌లాల్, పృథ్వీరాజ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన మరో మూవీ బ్రోడాడీని తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.

    Also Read:  ‘రాజమౌళి’ విజయాల వెనుక కారణం అదేనా ?

    ఈ వార్తల్లో నిజానిజాలు ఏమిటి అని ఆరా తీస్తే.. నిజమే అని తేలింది. రెండు సంపన్న కుటుంబాల మధ్య సాగే పంతాలు, పట్టింపుల నేపథ్యంలో బ్రోడాడీ కథనం సాగుతుంది. సినిమాలో మంచి ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. అయితే, ఈ రీమేక్‌ లో ఇద్దరు హీరోలు. మోహన్‌లాల్, పృథ్వీరాజ్‌ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది.

    మరి, మోహన్‌ లాల్ పాత్రలో చిరు కనిపిస్తారు.. ఇక పృథ్వీరాజ్‌ పాత్రలో ఎవరు నటిస్తారు ? ఇప్పటికీ ఉన్న సమాచారం ప్రకారం.. రవితేజ పేరు వినిపిస్తోంది. మరోపక్క రవితేజ కాదు, నాని అని అంటున్నారు. ఏ రకంగా చూసుకున్నా ఈ సినిమా పై ఫుల్ అంచనాలు ఉంటాయి. ఇక నానికి కూడా ఈ సినిమా మంచి అవకాశమే.

    Chiranjeevi- Nani

    ఎంతైనా నానికి ఫుల్ కామెడీ టైమింగ్ ఉంది. మెగాస్టార్ కామెడీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సో.. వీరిద్దరూ కలిస్తే.. ఆ సినిమా సూపర్ హిట్ కావడం పక్కా. మొత్తానికి ఈ వార్త మాత్రం మెగా అభిమానులకు మంచి కిక్ ను ఇస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు.

    Also Read:  కేసీఆర్ కు చినజీయర్ స్వామికి మధ్యలో దూరం పెరిగిందా?

    Tags