spot_img
Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi : మెగాస్టార్‌ త‌గ్గేదే లే.. 5 సినిమాలు లైన్లో.. అద్దిరిపోయే టైటిల్స్!

Megastar Chiranjeevi : మెగాస్టార్‌ త‌గ్గేదే లే.. 5 సినిమాలు లైన్లో.. అద్దిరిపోయే టైటిల్స్!

Acharya movie

రీ-ఎంట్రీ మెగాస్టార్ సినిమాలు అనౌన్స్ చేస్తున్న తీరు చూసి.. యంగ్ హీరోలే ఔరా అని ఆశ్చ‌ర్య‌పోవాల్సి వ‌స్తోంది. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ సూప‌ర్ ఫాస్ట్ గా సినిమాల‌ను ప్ర‌క‌టిస్తూ.. ఆ నాటి చిరును గుర్తుకు తెస్తున్నారు. క‌రోనా గోల‌తో అనివార్య‌మైన అవాంత‌రం వ‌చ్చిందేగానీ లేదంటే.. ఇప్ప‌టికే ప‌లు సినిమాలు ప‌ట్టాలెక్కేవి కూడా. లేటెస్ట్ అప్డేట్ ప్ర‌కారం.. మెగాస్టార్ మొత్తం ఐదు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. వీటిలో చాలా వ‌ర‌కు దుమ్ములేపే టైటిల్స్ కూడా రిజిస్ట‌ర్ చేసిన‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. మ‌రి, అవేంట‌న్న‌ది చూద్దాం.

ఆచార్యను త్వ‌ర‌లో రంగంలోకి దించ‌బోతున్నారు. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ద‌స‌రాను టార్గెట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. దీని త‌ర్వాత ముందుగా సెట్స్ పైకి వెళ్ల‌బోతున్న చిత్రం లూసిఫ‌ర్ రీమేక్‌. రీమేక్ స్పెష‌లిస్టుగా పేరు తెచ్చుకున్న మోహ‌న్ రాజా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ లుక్ నెవ్వ‌ర్ బిఫోర్ అన్న రేంజ్ లో ఉంటుంద‌ట‌. ఈ మూవీకి ‘గాడ్ ఫాద‌ర్‌’ అనే టిటైల్ ను ఫిక్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఆ త‌ర్వాత 154వ సినిమా వేదాళం రీమేక్ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. అత‌ని ట్రాక్ రికార్డులో భారీ డిజాస్ట‌ర్లే ఉన్నాయి. దీంతో.. చిరు చిత్రాన్ని ఎలా తెర‌కెక్కిస్తాడ‌నే ఆస‌క్తి ఉంది. అయితే.. మెగాస్టార్ కూడా ఈ చిత్రం విష‌యంలో చాలా కేర్ గా ఉన్నారు. ర‌మేష్ తో ప‌లుమార్లు సిట్టింగ్స్ వేసి, సినిమా గురించి ప‌లు సూచ‌న‌లు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రానికి ‘వాల్తేర్ వీర‌య్య‌’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. సందేశాత్మకంగా ఉండే ఈ చిత్రంలోనూ మెగాస్టార్‌.. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా క‌నిపిస్తార‌ని టాక్‌.

దీని త‌ర్వాత ద‌ర్శ‌కుడు బాబీ చిత్రం లైన్లో ఉంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొక్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయ‌ని తెలుస్తోంది. అయితే.. వేదాళం రీమేక్ ముందుగా వ‌స్తుందా? లేదంటే.. బాబీ చిత్రమే ముందుగా పట్టాలెక్కుతుందా? అనే స‌స్పెన్స్ కూడా ఉంది. ఈ చిత్రంలో మ‌రో స్టార్ హీరో కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇది ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా తెర‌కెక్కున్న‌ట్టు స‌మాచారం. ఈ మూవీకి.. ‘బోళా శంక‌ర్‌’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

వీటి తర్వాత దర్శకుడు మారుతితోనూ మెగాస్టార్ సినిమా ఉంటుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మొద‌ట్లో అడ‌ల్ట్ ద‌ర్శ‌కుడిగా ముద్ర‌ప‌డిన మారుతి.. ఆ త‌ర్వాత అద్భుత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించాడు. భ‌లేభ‌లే మ‌గాడివో, ప్ర‌తిరోజూ పండ‌గే వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను అందించాడు. ఈ నేప‌థ్యంలోనే మారుతి చెప్పిన క‌థ‌కు మెగాస్టార్ ఇంప్రెస్ అయ్యార‌ని టాక్. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆగ‌స్టు 22 చిరు బ‌ర్త్ డే. మ‌రి, ఈ రోజున మెగాస్టార్‌ చిత్రాల‌కు సంబంధించి ఎలాంటి అనౌన్స్ మెంట్లు వ‌స్తాయో చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version