https://oktelugu.com/

Nani Feel Very Bad : మళ్ళీ మరో సినిమా.. బాధలో నాని !

Nani Feel Very Bad: హీరో నాని(Nani) ప్రస్తుతం బాధలో ఉన్నాడు. మరోపక్క పుకార్ల భయం పట్టుకుంది. కారణం.. టక్ జగదీష్(Tuck Jagadish) విషయంలో నాని ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యాడు. ‘థియేటర్లు మన సంస్కృతిలో భాగం’ అంటూ ఇచ్చిన ఓ ఉపన్యాసం నాని ని బాగా ఇబ్బంది పెడుతుంది. ఆ రోజు ఏదో థియేటర్స్ కి సపోర్ట్ చేద్దాం అని చెప్పిన స్పీచ్ ను పట్టుకుని.. తనను బాగా ఇబ్బంది పెడుతూ బాధకి గురి చేస్తున్నారని […]

Written By:
  • admin
  • , Updated On : August 20, 2021 / 06:15 PM IST
    Follow us on

    Nani Feel Very Bad: హీరో నాని(Nani) ప్రస్తుతం బాధలో ఉన్నాడు. మరోపక్క పుకార్ల భయం పట్టుకుంది. కారణం.. టక్ జగదీష్(Tuck Jagadish) విషయంలో నాని ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యాడు. ‘థియేటర్లు మన సంస్కృతిలో భాగం’ అంటూ ఇచ్చిన ఓ ఉపన్యాసం నాని ని బాగా ఇబ్బంది పెడుతుంది. ఆ రోజు ఏదో థియేటర్స్ కి సపోర్ట్ చేద్దాం అని చెప్పిన స్పీచ్ ను పట్టుకుని.. తనను బాగా ఇబ్బంది పెడుతూ బాధకి గురి చేస్తున్నారని నాని చెప్పుకుని బాధ పడే స్థాయికి వెళ్ళిపోయింది ఈ వ్యవహారం.

    అయితే, ఇక్కడ నాని మిస్టేక్ కూడా ఉంది. ఎప్పుడైనా వ్యవస్థకు సంబంధించిన అంశంలో వేలు పెట్టేటపుడు మిగిలిన నాలుగు వేళ్ళను చూసుకుని, అప్పుడు లెక్షర్లు ఇస్తే బాగుండేది. కానీ, నాని తొందర పడి థియేటర్ రిలీజ్ కే తానూ కట్టుబడి ఉన్నాను అంటూ చెప్పిన నెలకే, తన సినిమాని ఓటీటీ వేదిక పై రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చింది.

    ఈ నేపథ్యంలో మళ్ళీ ట్రోలింగ్ కి గురి కాకుండా.. ప్రేక్షకులను ముఖ్యంగా తన పై విరుచుకుపడుతున్న నెటిజన్లను మంచి చేసుకోవడానికి ఒక ఎమోషనల్ మెసేజ్ రాసి లెటర్ ను కూడా వదిలాడు. నిర్మాతల శ్రేయస్సు కోసం తానూ ఈ నిర్ణయాన్ని తీసుకొవాల్సి వచ్చింది అంటూ ఆ లెటర్ లో రాసుకొచ్చాడు.

    అయినప్పటికీ నాని పై విమర్శలు ఆగడం లేదు, అలాగే పుకార్లు ఆగడం లేదు. మరోపక్క తాజాగా మరో రూమర్ బయటకు వచ్చింది. నాని హీరోగా వస్తోన్న “శ్యామ్ సింగ రాయ్” సినిమా కూడా ఓటీటీలోకి రాబోతుంది అంటూ ఆ రూమర్ సారాంశం. అంటే.. వరుసగా మూడో సినిమాని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తోన్న ఏకైక తెలుగు హీరోగా నాని మిగిలిపోతాడు.

    ఇదే నిజం అయితే, ఇక నాని ఇంకా ఎక్కువ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే, ఈ పుకారు బయటకు రాగానే వెంటనే భయపడి అలాంటిదేమి లేదు అని నాని తన టీమ్ చేత క్లారిటీ ఇప్పించాడు. ఎట్టిపరిస్థితుల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేస్తాం అంటూ నాని టీమ్ చెబుతుంది.

    ఇక్కడే ప్రేక్షకుల నుంచి మరో ప్రశ్న ఎదురవుతుంది. “వి”, “టక్ జగదీష్” సినిమాల విషయంలో కూడా థియేటర్లోనే రిలీజ్ చేస్తామని నాని మాట ఇచ్చాడు, కానీ ఆ మాట తప్పాడు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా తప్పుతాడు అంటూ నానిని మళ్ళీ ట్రోల్ చేస్తూ ట్రోలర్స్ ప్రశ్నిస్తున్నారు.