
Mega Daughter Surprise: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు నేడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెగాస్టార్ ఫోటోలు, మెగాస్టార్ సినీ కెరీర్ కు సంబంధించిన విశేషాలే కనిపిస్తున్నాయి. మరోపక్క మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన వరుస అప్ డేట్స్ వస్తున్నాయి. అయితే తాజాగా మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Sushmita Konidela) కూడా తన తండ్రి పుట్టిన రోజుకు అభిమానులకు ఒక ప్రత్యేక బహుమతి ఇచ్చారు.
సుస్మిత ఇటీవల తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే బ్యానర్ పై ఆమె సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. ఈ క్రమంలో జీ5 కోసం కూడా ఆమె ఒక సిరీస్ ను నిర్మించింది. తాజాగా తన భర్త విష్ణుప్రసాద్ తో కలిసి సినీ నిర్మాణంలోకి అడుగు పెట్టింది. తన తొలి చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’ అంటూ ఒక సినిమాని ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.
కాగా ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా సంతోష్ శోభన్, గౌరి జి. కిషన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. మొత్తానికి చిరు బర్త్ డే సందర్భంగా చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితా కొణిదెల మెగా ఫ్యాన్స్ కి చిన్న సర్ ప్రైజ్ అయితే ఇచ్చారు. మరి ఆమె సినీ నిర్మణంలో సక్సెస్ కావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇక ఇప్పటికే సుష్మిత కాస్ట్యూమ్స్ డిజైనర్ గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సైరా నరసింహ రెడ్డి సినిమాలో మెగాస్టార్ కాస్ట్యూమ్స్ ను సుస్మితానే డిజైన్ చేశారు. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ – మెహర్ రమేష్ చేస్తోన్న వేదాళం రీమేక్ కోసం కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు.