
జేఈఈ మెయిన్ చివరిదైన నాలుగో సెషన్ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. నాలుగో విడుత పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌడ్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆన్ లైన్ పరీక్షలు ఈనెల 26,27,31 తేదీల్లో, వచ్చేనెల 1,2 తేదీల్లో జరుగనున్నాయి. మొత్తం 7 లక్షల కు పైగా విద్యార్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్ఐటీలు, ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ ను ఈ ఏడాది నుంచి నాలుగు విడుతల్లో జరపాలని విద్యాశాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే.