Bhola Shankar Collections: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ ఆగస్టు 11న వరల్డ్ వైడ్ విడుదలైంది. భోళా శంకర్ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు కాగా తమన్నా హీరోయిన్. కీలమైన సిస్టర్ రోల్ కీర్తి సురేష్ చేయడం విశేషం. భోళా శంకర్ చిత్రం పై పెద్దగా అంచనాలు లేవు. రీమేక్ కావడంతో ఫ్యాన్స్ కొంచెం లైట్ తీసుకున్నారు. అదే సమయంలో మొదటి షో నుండే నెగిటివిటీ నడిచింది. అయినప్పటికీ సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లు దక్కాయి. అది మెగాస్టార్ మేనియాకు నిదర్శనం.
భోళా శంకర్ వసూళ్లు పరిశీలిస్తే… నైజాంలో రూ. 4.51 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కృష్ణా జిల్లాలో రూ.1.02 కోట్లు రాబట్టింది. గుంటూరు రూ. 2.07 కోట్లు, వైజాగ్ ఏరియా రూ. 1.84 కోట్లు వసూలు చేసింది. ఇక నెల్లూరులో రూ. 39 లక్షల షేర్ వసూలు చేసింది. మిగతా ఏరియాల వసూళ్ల వివరాలు అందాల్సి ఉంది. వరల్డ్ వైడ్ మొదటి రోజు భోళా శంకర్ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. వరల్డ్ వైడ్ ఈ చిత్ర షేర్ రూ. 20 కోట్లు లోపే.
భోళా శంకర్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే చాలా రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రాన్ని నైజాంలో రూ. 22 కోట్లకు అమ్మారు. సీడెడ్ రూ. 12 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 9.5 కోట్లు, తూర్పు గోదావరి రూ. 6 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.4.40 కోట్లకు అమ్మారు. ఇక గుంటూరు రూ. 6 కోట్లు, కృష్ణ రూ. 4.5 కోట్లు, నెల్లూరు రూ. 3 కోట్లకు విక్రయించారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.67.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రెస్టాప్ ఇండియా ఓవర్ సీస్ కలుపుకుంటే రూ. 79 కోట్ల బిజినెస్ చేసింది. భోళా శంకర్ టార్గెట్ రూ. 80 కోట్లకు పైనే ఉంది…
మరి ఓపెనింగ్ వసూళ్లు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఏ మేరకు ఈ టార్గెట్ రీచ్ అవుతుందో చూడాలి. భోళా శంకర్ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాత. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.