Veerasimha Reddy Chiranjeevi : ‘వీరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి..టాలీవుడ్ లో ఇదే తొలిసారి!

Veerasimha Reddy Chiranjeevi : ప్రతీ సంక్రాంతి లాగానే ఈ సంక్రాంతి కూడా స్టార్ హీరోల సినిమాలతో థియేటర్స్ కళకళలాడనుంది..మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మరియు నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలు జనవరి 12 మరియు 13 వ తారీఖులలో విడుదల కాబోతున్నాయి..ఈ రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీ మేకర్స్ నుండే విడుదల కాబోతున్నాయి..తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒకే ప్రొడక్షన్ హౌస్ నుండి రెండు పెద్ద సినిమాలు ఒక్క […]

Written By: NARESH, Updated On : December 23, 2022 8:45 pm
Follow us on

Veerasimha Reddy Chiranjeevi : ప్రతీ సంక్రాంతి లాగానే ఈ సంక్రాంతి కూడా స్టార్ హీరోల సినిమాలతో థియేటర్స్ కళకళలాడనుంది..మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మరియు నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలు జనవరి 12 మరియు 13 వ తారీఖులలో విడుదల కాబోతున్నాయి..ఈ రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీ మేకర్స్ నుండే విడుదల కాబోతున్నాయి..తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒకే ప్రొడక్షన్ హౌస్ నుండి రెండు పెద్ద సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో విడుదల అవ్వడం ఇదివరకు ఎప్పుడు జరుగలేదు..ఇదే తొలిసారి.

అయితే చిరంజీవి మరియు బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ వార్స్ ఇప్పటివి కాదు..దశాబ్దాల నుండి వీళ్లిద్దరి సినిమాలు పోటీపడుతూనే ఉన్నాయి..కొన్నిసార్లు చిరంజీవి పై చెయ్యి సాధించగా..కొన్ని సార్లు బాలయ్య బాబు పై చెయ్యి సాధించాడు..కానీ గ్రౌండ్ లెవెల్ లో ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య కూడా పోటీ ఒక రేంజ్ లో ఉండేది..కొన్ని కొన్ని చోట్ల పెద్దఎత్తున గొడవలు కూడా జరిగేవి.

ఈసారి అలా గొడవలు జరగకుండా మైత్రీ మూవీ మేకర్స్ ఒక ప్లాన్ వేసింది..అదేమిటి అంటే అతి త్వరలోనే జరగబోతున్న ‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ని ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఇటీవలే మెగాస్టార్ ని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు అడగగా వెంటనే ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది..అలాగే ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా నందమూరి బాలకృష్ణ ని ముఖ్య అతిథిగా పిలిచే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు.

అంతే కాకుండా వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇంటర్వూస్ కూడా చిత్రీకరించబోతున్నారట..ఈ క్రేజ్ ఐడియా అదిరిపోయింది కదూ..ఇక ఫ్యాన్స్ కి అయితే కనులపండుగే అని చెప్పొచ్చు..తద్వారా మేము మేము బాగానే ఉంటాము..అభిమానులు కూడా ఇలా కలిసి ఉండాలి..ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్నాయి అని సందేశం ఇవ్వనున్నారట..దీనికి సంబంధించిన అధికారిక వివరాలు అతి త్వరలోనే ప్రకటించనున్నారు.