‘Dhamaka’ Movie Collections : మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘ధమాకా’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే..గడిచిన కొద్దీ సంవత్సరాలలో రవితేజ సినిమాకి మంచి హైప్ రావడం ఈ చిత్రానికే జరిగింది..సాంగ్స్ సూపర్ అవ్వడం..టీజర్ మరియు ట్రైలర్ కి కూడా అదిరిపొయ్యే రెస్పాన్స్ రావడం వల్లే ఈ సినిమాకి ఇంతమంచి హైప్ ఏర్పడింది..హైప్ కి తగ్గట్టుగానే టాక్ కూడా పాజిటివ్ గా రావడం తో ఓపెనింగ్స్ దద్దరిల్లిపోయాయి.
మాస్ సెంటర్స్ లో రవితేజ కి బంపర్ ఓపెనింగ్స్ వస్తాయి అనే విషయం అందరికి తెలిసిందే..కానీ ఈ చిత్రానికి క్లాస్ సెంటర్స్ లో కూడా ఓపెనింగ్స్ అదిరిపోయాయి..ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో ఈ సినిమాకి మ్యాట్నీ నుండి మల్టిప్లెక్స్ షోస్ కూడా హౌస్ ఫుల్ అయ్యాయి..ఇక నైజాం మాస్ సెంటర్స్ లో అయితే ఉదయం ఆట నుండే థియేటర్స్ హౌస్ ఫుల్స్ అయ్యాయి..ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తే నైజాం లో మొదటి రోజు కచ్చితంగా రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..చిన్న చిన్న సి సెంటర్స్ నుండి A సెంటర్స్ వరకు ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్..ముఖ్యంగా సీడెడ్ మాస్ సెంటర్స్ నేటి తరం స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఓపెనింగ్స్ ని ఈ సినిమాకి ఇచ్చారు జనాలు..రవితేజ కి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్ లో ఊగిపోతుందో అని ట్రేడ్ వర్గాలకు మరోసారి అర్థం అయ్యేలా చేసింది ఈ ధమాకా చిత్రం..ఒకటి రెండు ఫ్లాప్స్ తో పొయ్యే మార్కెట్ కాదని..రవితేజ కి సరైన సినిమా పడితే బాక్స్ ఆఫీస్ బద్దలు అని సోషల్ మీడియా లో రవితేజ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకి మొదటి రోజు 5 కోట్ల రూపాయిల షేర్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.