Chiranjeevi Kubera Success Meet: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush) కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం లో తెరకెక్కిన ‘కుబేర'(Kubera Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ కి ఈమధ్య కాలం లో వరుసగా సూపర్ హిట్స్ వస్తున్నాయి, ‘కుబేర’ అందుకు కొనసాగింపు కానీ, నాగార్జునకు మాత్రం చాలా కాలం తర్వాత ఈ చిత్రం ద్వారా ఒక సూపర్ హిట్ తన ఖాతాలో చేరింది. అందుకు ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ అభిమానులు మాత్రం నాగార్జున రేంజ్ కి తగ్గ క్యారక్టర్ ఇది కాదంటూ సోషల్ మీడియా లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి పాత్రలు మళ్ళీ చేయొద్దు అంటూ నాగార్జున ని ఆయన అభిమానులు ప్రాధేయపడుతున్నారు. కానీ నాగార్జున తన మనసుకి ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్లిపోయే రకం అనే సంగతి మన అందరికీ తెలిసిందే.
Also Read: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నప్ప స్టోరీ మొత్తం లీక్ చేసిన మోహన్ బాబు..వీడియో వైరల్!
అయితే నాగార్జున కి ఇండస్ట్రీ లో అత్యంత సన్నిహితుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మాత్రమే. నాగార్జున ప్రతీ సంతోషకరమైన సమయంలోనూ, అదే విధంగా విచారకరమైన సందర్భంలోనూ ఒక స్నేహితుడిగా చిరంజీవి ఎప్పుడూ ముందు ఉంటాడు. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా ఈ ఇద్దరు అన్నదమ్ములు లాగానే జనాలకు కనిపిస్తుంటారు. అయితే రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి ‘కుబేర’ చిత్రాన్ని చూశాడట. ఈ సినిమాని చూసిన తర్వాత నాగార్జున ని, ధనుష్ ని,శేఖర్ కమ్ముల ని,అదే విధంగా మూవీ టీం మొత్తాన్ని ఆయన ప్రత్యేకంగా ఫోన్ చేసి విష్ చేశాడట. అంతే కాదు ఈరోజు నిర్వహించబోతున్న సక్సెస్ మీట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు చేయనున్నారు. నేడు సాయంత్రం అభిమానుల సమక్షం లో కాకుండా, ప్రైవేట్ గా ఈ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారట.
గతంలో నాగార్జున హీరో గా నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమాని చూసినప్పుడు కూడా చిరంజీవి స్వయంగా నాగార్జున కి ఫోన్ చేసి,ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయమని చెప్పి, ఆయన ఆ చిత్రం గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడాడు. ఇలా నాగార్జున విజయం సాధించినప్పుడల్లా తన సొంత విజయం లాగా భావించి,తన కుటుంబ సభ్యుడే సూపర్ హిట్ కొట్టినంత ఆనందం పడుతూ ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి. నాగార్జున తో ఆయనకు అంత మంచి సాన్నిహిత్యం ఉన్నది. నేడు కుబేర సక్సెస్ మీట్ ఈవెంట్ లో చిరంజీవి ఏమి మాట్లాడబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. అయితే ఈ ఈవెంట్ కి ధనుష్ వస్తున్నాడా లేదా అనేది చూడాలి. చిరంజీవి లాంటి వ్యక్తి ఈవెంట్ కి వస్తున్నప్పుడు ధనుష్ రావాల్సిందే. లేకుంటే మర్యాద ఉండదు, మరి ఆయన వస్తాడో లేదో చూడాలంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.