Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9: ఆ కాంట్రవర్సీ లేడీ హౌస్లోకి......

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9: ఆ కాంట్రవర్సీ లేడీ హౌస్లోకి… మామూలు రచ్చ కాదు!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ అత్యంత ప్రజాదరణ కలిగిన రియాలిటీ షో. బ్రిటన్ లో రూపొందించిన బిగ్ బ్రదర్ రియాలిటీ షో దీనికి స్ఫూర్తి. ఇండియాలో హిందీలో బిగ్ బాస్ షో రెండు దశాబ్దాల క్రితం మొదలైంది. అక్కడ సక్సెస్ కావడంతో ఇతర ప్రాంతీయ భాషలకు ఈ షో వ్యాపించింది. తెలుగులో 2017లో ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ట్రెమండస్ సక్సెస్ కావడంతో స్టార్ మా ప్రతి ఏడాది ఒక సీజన్ ప్రసారం చేస్తుంది. ఇప్పటికి 8 సీజన్స్ పూర్తి అయ్యాయి. సీజన్ 8 విన్నర్ గా కన్నడ సీరియల్ నటుడు నిఖిల్ నిలిచాడు.

కాగా సీజన్ 9 త్వరలో ప్రసారం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలైంది. పలువురు సెలెబ్స్ ని బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదిస్తున్నారు. ప్రతి సీజన్లో స్టార్ మా సీరియల్ నటులు కొందరు ఉంటున్నారు. ఈసారి కావ్యశ్రీ, తేజస్విని, సాయి కిరణ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరు స్టార్ మాలో ప్రసారం అయిన సీరియల్స్, షోలలో సందడి చేస్తున్నారు. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో కంటెస్ట్ చేస్తున్న కొందరు సెలెబ్స్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టడం ఖాయం అంటున్నారు.

గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతి రాయ్ పేరు కూడా వినిపిస్తుంది. తెలుగు, కన్నడ గత సీజన్లో జ్యోతి రాయ్ కి ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆమె రిజెక్ట్ చేశారు. సినిమాలు, సిరీస్లు చేస్తూ బిజీగా ఉన్న నేను బిగ్ బాస్ షోకి రాలేనని ఆమె వివరణ ఇచ్చారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అయినా ఆమె కంటెస్ట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నటి కల్పిక గణేష్ ఈ సీజన్లో కంటెస్ట్ చేయనున్న క్రేజీ కంటెస్ట్ అనే వాదన వినిపిస్తుంది. కల్పిక గణేష్ ఇటీవల ఓ పబ్ లో రచ్చ చేసింది. సిబ్బందితో గొడవకు దిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పబ్లిసిటీ కోసమే కల్పిక ఇలా చేశారనే విమర్శలు వినిపించాయి.

కల్పిక తనను సమర్ధించుకున్నప్పటికీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ కేసులో ఆమె విచారణ ఎదుర్కొంటుంది. ఈ ఒక్క సంఘటన కల్పికకు బిగ్ బాస్ షోలో ఆఫర్ తెచ్చిపెట్టిందట. కల్పికను దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. ఆరంజ్, నమో వెంకటేశా, జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో కల్పిక ఫేమ్ తెచ్చుకుంది. కల్పిక కనుక హౌస్లో అడుగుపెడితే రచ్చే అంటున్నారు ప్రేక్షకులు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది లాంచింగ్ ఈవెంట్ వరకు రహస్యమే. కాబట్టి కల్పికకు ఛాన్స్ వచ్చిందా లేదా అనేది అప్పటి వరకు తెలిసే అవకాశం లేదు.

Exit mobile version