Jailer 2 Movie : సౌత్ ఇండియా లో సూపర్ స్టార్స్ గా దశాబ్దాల నుండి నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న హీరోలు ఎవరైనా ఉన్నారా అంటే అది మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్. 7 పదుల వయస్సు దాటినప్పటికీ కూడా నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడుతూ, సూపర్ స్టార్ స్టేటస్ లను మైంటైన్ చేస్తున్న ఏకైక హీరోలు వీళ్లిద్దరే. ఒకప్పుడు వీళ్లిద్దరు కలిసి ‘బందిపోటు సింహం’ , ‘ఖాళీ’ వంటి చిత్రాల్లో హీరోలుగా నటించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు రజినీకాంత్ హీరో గా నటించిన ‘మాపిళ్ళై’ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించాడు. అంతే ఆ తర్వాత మళ్ళీ వీళ్లిద్దరు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే త్వరలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించబోతున్న ‘జైలర్ 2 ‘ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ లో మెరవబోతున్నట్టు తెలుస్తుంది.
‘జైలర్’ చిత్రం లో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి సూపర్ స్టార్స్ గెస్ట్ రోల్స్ లో కనిపించారు. వాళ్ళు స్క్రీన్ మీద కనిపించింది కేవలం 5 నిమిషాలే అయినప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని పవర్ ఫుల్ ఇంపాక్ట్ చూపించిన క్యారెక్టర్స్ లోనే కనిపించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అలాంటి క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. ఆయన హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ మన తెలుగులో మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అండర్ వరల్డ్ డాన్ గా నటించాడు. ‘జైలర్ 2 ‘ లో ఆ పాత్ర కొనసాగనుంది. రజినీకాంత్ ఒక ముఖ్యమైన విషయంలో చిరంజీవి సహాయం కోసం వస్తాడట. కేవలం ఈ పాత్ర 5 నిమిషాలే ఉన్నప్పటికీ మంచి ప్రభావం చూపిస్తుందట. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ టీజర్ ని విడుదల చేయగా, దానికి యూట్యూబ్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
ఒక సినిమాని ఇలా కూడా ప్రకటించొచ్చా అని ఆడియన్స్ షాక్ అయ్యేలా చేసింది ఈ వీడియో. కేవలం అనౌన్స్మెంట్ టీజర్ ఈ రేంజ్ లో ఉంటే, ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు అని అభిమానులు ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు. జైలర్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గ్గర దాదాపుగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు దాని సీక్వెల్ తో రజిని వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చాలా తేలికగా అడుగుపెట్టబోతున్నాడని అంటున్నారు అభ్హిమానులు. ఈ ఏడాది ద్వితీయార్థం లో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు గురించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నారు. పార్ట్ 1 లో నటించిన ప్రతీ ఒక్కరు పార్ట్ 2 లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం కూలీ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న రజినీకాంత్ ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ‘జైలర్ 2 ‘ కి షిఫ్ట్ అవ్వబోతున్నాడు.